నేటి నుంచి జేఈఈ మెయిన్స్ యథాతథం!
Sakshi Education
న్యూఢిల్లీ: జేఈఈ మెయిన్స్ పరీక్షలను మంగళవారం నుంచి నిర్వహించడానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) అన్ని ఏర్పాట్లు చేస్తోంది.
విద్యార్థులకు తగిన తోడ్పాటును అందించాల్సిందిగా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఉన్న అసందిగ్ధ పరిస్థితుల్లో, విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు. జేఈఈ పరీక్షలను సెప్టెంబర్ 1 నుంచి 6వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లకు నీట్ సెప్టెంబర్ 13వ తేదీన జరగనుంది. జేఈఈ మెయిన్స్ పరీక్షలకు 8.58 లక్షల మంది హాజరవనుండగా, నీట్ పరీక్షలకు 15.97 లక్షల మంది విద్యార్థులు రిజిస్టర్ చేయించుకున్నారు.
Published date : 01 Sep 2020 03:44PM