నేటి నుంచి ఏపీ పీజీఈసెట్ 2020
Sakshi Education
ఏయూక్యాంపస్ (విశాఖ తూర్పు): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్, ఫార్మసీ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ పీజీఈసెట్ (ఆంధ్రప్రదేశ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్)ను సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నట్లు కన్వీనర్ ఆచార్య పేరి శ్రీనివాసరావు తెలిపారు.
విశాఖలోని సెట్ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సెట్‌కు ఏపీలోని 14 నగరాల్లో 40 కేంద్రాలను, హైదరాబాద్‌లో 2 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పరీక్షకు నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదన్నారు. కోవిడ్ నియమావళిని అనుసరిస్తూ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. అనారోగ్య లక్షణాలు కలిగిన వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు.
Published date : 28 Sep 2020 02:59PM