Skip to main content

నేడు లాసెట్, పీజీలాసెట్- 2020 పరీక్షలు

సాక్షి, హైదరాబాద్: అక్టోబర్ 9న జరిగే లాసెట్-20, పీజీలాసెట్-20 పరీక్షలకు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు కన్వీనర్ జీబీ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
రాష్ట్రంలోని లా కాలేజీల్లో 5,869 సీట్లున్నాయని, ఇందులో మూడేళ్ల డిగ్రీ కోర్సులో 3,969, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులో 1,280, ఎల్‌ఎల్‌ఎం(పీజీ)కోర్సులో 620 సీట్లున్నాయన్నారు. ఈ పరీక్షలకు మొత్తం 30,310 మంది దరఖాస్తు చేసుకున్నట్లు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 63 పరీక్షా కేంద్రాలు, ఆంధ్రప్రదేశ్‌లో మరో 4 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసి పరీక్షను కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.
Published date : 09 Oct 2020 01:32PM

Photo Stories