Skip to main content

మే చివరి వారంలో జేఈఈ మెయిన్స్ 2020 !

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పలు ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశం కల్పించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ జేఈఈ మెయిన్స్ పరీక్ష మే నెల చివరి వారంలో నిర్వహించే అవకాశం ఉందని మానవ వనరుల అభివృద్ధి శాఖకు చెందిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మంగళవారం తెలిపింది.
ఈ పరీక్షలు ఏప్రిల్ 5-11 వరకు జరగాల్సి ఉంది. రానున్న వారాల్లో పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేస్తామని తెలిపింది. ఏప్రిల్ 15 తర్వాత అప్పటి పరిస్థితులను బట్టి అడ్మిట్ కార్డులు విడుదల చేస్తామంది. ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో ప్రవేశాలకు జేఈఈ పరీక్ష రాయాల్సి ఉంటుంది.
Published date : 01 Apr 2020 03:18PM

Photo Stories