మే 15 వరకు సీఎల్ఏటీ దరఖాస్తుల స్వీకరణ
Sakshi Education
సాక్షి, న్యూఢిల్లీ: కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (సీఎల్ఏటీ)–2021కు దరఖాస్తు గడువు పొడిగిస్తున్నట్లు నేషనల్ లా యూనివర్సిటీస్ కన్సార్టియం ఎగ్జిక్యూటివ్ కమిటీ పేర్కొంది.
దరఖాస్తులు సమరి్పంచడానికి మే 15 వరకు గడువు పొడిగిస్తున్నట్లు తెలిపింది. గతంలో ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం దరఖాస్తులు సమర్పించడానికి ఏప్రిల్ 30 చివరితేదీ కాగా పరీక్షను జూన్ 13న నిర్వహించాలి. అయితే తాజాగా దరఖాస్తుల సమర్పణకు గడువు పొడిగించినప్పటికీ పరీక్ష నిర్వహించే తేదీని మాత్రం కన్సారి్టయం వెల్లడించలేదు.
Published date : 30 Apr 2021 03:12PM