మార్చి 1న పీఈసెట్– 2021 నోటిఫికేషన్
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (డీపీఈడీ), బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (బీపీఈడీ) కోర్సుల్లో ప్రవేశాల కోసం మార్చి 1వ తేదీన పీఈసెట్–2021 నోటిఫికేషన్‌ను జారీ చేయాలని సెట్ కమిటీ నిర్ణయించింది.
ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన గురువారం సెట్ కమిటీ సమావేశం జరిగింది. పీఈసెట్‌కు వచ్చే నెల 8 నుంచి మే 8వ తేదీ వరకు ఆన్‌లైన్ దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెలిపింది. మే 17వ తేదీ నుంచి విద్యార్థులు హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని పేర్కొంది. జూన్ 7వ తేదీ నుంచి ఫిజికల్ టెస్టులు నిర్వహించనున్నట్లు వివరించింది. టెస్టులు ముగిసిన వారం రోజుల్లో ఫలితాలు ప్రకటిస్తామని వెల్లడించింది. ఆన్‌లైన్ దరఖాస్తుల ఫీజును ఎస్సీ, ఎస్టీలకు రూ. 400గా, ఇతరులకు రూ. 800గా నిర్ణయించారు. అర్హతలకు సంబంధించిన పూర్తి వివరాలను వెబ్‌సైట్‌లో చూడాలని సూచించింది.
Published date : 26 Feb 2021 04:24PM