మార్చి 17న టీఎస్ ఈసెట్– 2021 నోటిఫికేషన్.. ఇదీ షెడ్యూల్..
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తయిన విద్యార్థులు ఇంజనీరింగ్, ఫార్మసీ ద్వితీయ సంవత్సరంలో చేరేందుకు (లేటరల్ ఎంట్రీ) నిర్వహించే ఈసెట్–2021 నోటిఫికేషన్ ను ఈనెల 17న జారీ చేయాలని సెట్ కమిటీ నిర్ణయించింది.
ఆన్‌లైన్ ద్వారా జరిగిన ఈ సమావేశంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి, ఈసెట్ కన్వీనర్ సీహెచ్ వెంకటరమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సెట్ సిలబస్, రిజిస్ట్రేషన్ ఫీజు తదితర అంశాలపై ఈ సందర్భంగా చర్చించి నిర్ణ యం తీసుకున్నారు. ఈసె ట్ ద్వారా ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరంలో చేరే విద్యార్థులకు కొత్త కోర్సుల్లోనూ అవకాశం కల్పించాలని నిర్ణయించారు. కృత్రిమ మేధ, మెషీన్ లెర్నింగ్, డేటా సై¯న్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్, సైబర్ సెక్యూరిటీ, కంప్యూటర్ సై¯న్స్ అండ్ ఇంజనీరింగ్ నెట్‌వర్క్స్ తదితర కోర్సుల్లోనూ ప్రవేశాలు కల్పించనున్నారు. పరీక్షల షెడ్యూలును ఖరారు చేశారు. ఈనెల 22 నుంచి మే నెల 17 వరకు ఆన్‌లైన్ లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. రిజిస్ట్రేషన్ ఫీజు ఎస్సీ, ఎస్టీలకు రూ.400గా, ఇతరులకు రూ.800గా నిర్ణయించారు. 18 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. అందులో తెలంగాణలో 14, ఏపీలో 4 కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
జూలై 1 న ఆన్‌లైన్ పరీక్షలు
ఉదయం 9 గంటల నుంచి మధాహ్నం 12 గంటల వరకు ఈసీఈ, ఈఐఈ, సీఎస్‌ఈ, ఈఈఈ సబ్జెక్టులకు, మధాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సివిల్, కెమికల్, మెకానికల్, మైనింగ్, ఎంఈటీ, పీహెచ్‌ఎం, బీఎస్‌ఎం సబ్జెక్టులకు సంబంధించి ఈసెట్ ఆన్‌లైన్ లో నిర్వహించనున్నారు.
ఇదీ షెడ్యూలు..
జూలై 1 న ఆన్‌లైన్ పరీక్షలు
ఉదయం 9 గంటల నుంచి మధాహ్నం 12 గంటల వరకు ఈసీఈ, ఈఐఈ, సీఎస్‌ఈ, ఈఈఈ సబ్జెక్టులకు, మధాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సివిల్, కెమికల్, మెకానికల్, మైనింగ్, ఎంఈటీ, పీహెచ్‌ఎం, బీఎస్‌ఎం సబ్జెక్టులకు సంబంధించి ఈసెట్ ఆన్‌లైన్ లో నిర్వహించనున్నారు.
ఇదీ షెడ్యూలు..
- 17–3–2021న: నోటిఫికేషన్
- 22–3–2021 నుంచి 17–5–2021 వరకు: ఆన్‌లైన్ లో రిజిస్ట్రేషన్
- 31–5–2021 వరకు: రూ.250 ఆలస్య రుసుముతో దరఖాస్తులు
- 14–6–2021 వరకు: రూ.500 ఆలస్య రుసుముతో దరఖాస్తు గడువు
- 24–6–2021 వరకు: రూ.2,500 ఆలస్య రుసుముతో దరఖాస్తు గడువు
- 28–6–2021 వరకు: రూ.5 వేల ఆలస్య రుసుముతో దరఖాస్తు గడువు
Published date : 10 Mar 2021 04:28PM