Skip to main content

లోకాయుక్తలో ‘అసిస్టెంట్‌’ నియామక పరీక్ష వాయిదా

సాక్షి, హైదరాబాద్‌: లోకాయుక్త కార్యాలయంలో అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి సంబంధించి ఈ నెల 25న జరగాల్సిన పరీక్షను వాయిదా వేసినట్లు ఇన్‌చార్జి రిజిస్ట్రార్ కె.నీరజ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో నగరంలోని దోమలగూడ ఏవీ కళాశాలలో నిర్వహించాల్సిన ఈ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు. పరీక్ష నిర్వహించే తేదీలను తర్వాత ప్రకటిస్తామన్నారు.
Published date : 24 Apr 2021 03:59PM

Photo Stories