Skip to main content

క్యాట్ ఫలితాలు విడుదల

సాక్షి, హైదరాబాద్: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)లలో 2020-21 విద్యా సంవత్సరం ఎంబీఏ కోర్సులో ప్రవేశాలకు సంబంధించి గతేడాది నవంబర్ 24న నిర్వహించిన క్యాట్ (కామన్ అడ్మిషన్ టెస్ట్)-2019 పరీక్ష ఫలితాలు జనవరి 4 (శనివారం)న విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా 2.09 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు.
ఇందులో 1.34 లక్షల మంది పురుషులు, 75 వేల మంది మహిళలు ఉన్నారు. తెలంగాణకు చెందిన వారు దాదాపు 7 వేల మంది క్యాట్ పరీక్ష రాసినట్లు సమాచారం. తాజా ఫలితాల్లో దేశవ్యాప్తంగా 10 మంది విద్యార్థులు 100 పర్సంటైల్ సాధించగా, వీరంతా పురుషులే కావడం గమనార్హం. 100 పర్సంటైల్ వచ్చిన వారంతా డిగ్రీలో ఇంజనీరింగ్ నేపథ్యమున్న వారే. టాప్ టెన్‌లో ఆరుగురు ఐఐటీ విద్యార్థులు కాగా, మరో ఇద్దరు ఎన్‌ఐటీకి చెందిన విద్యార్థులు. వీరిలో నలుగురు మహారాష్ట్ర, మిగిలిన ఆరుగురు తెలంగాణ, జార్ఖండ్, తమిళనాడు, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు చెందినవారు. మరో 21 మంది 99.9 పర్సంటైల్ సాధించగా, ఇందులో 19 మంది ఇంజనీరింగ్ నేపథ్యమున్న వారే కావడం గమనార్హం. వరంగల్ నిట్ విద్యార్థులు క్యాట్ ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చారు.
Published date : 06 Jan 2020 04:20PM

Photo Stories