కోవిడ్‌తో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు ఫిట్‌జీ ఉపకార వేతనాలు
Sakshi Education
సాక్షి,హైదరాబాద్: కోవిడ్ కారణంగా తల్లి లేదా తండ్రి లేదా ఇద్దరినీ కోల్పోయిన విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించేందుకు ఎఫ్ఐఐటీజేఈఈ (ఫిట్జీ) విద్యాసంస్థ సామాజిక బాధ్యతగా ముందుకొచ్చింది.
సంరక్షకులు లేని కారణంగా ఏ ఒక్క విద్యార్థి చదువుకునేందుకు ఇబ్బంది పడకూడదన్న లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఆ విద్యార్థులకు వందశాతం ఫీజు మాఫీతో పాటు అన్ని రకాల ట్యూషన్ ఫీజులు, స్టడీ మెటీరియల్ ఫీజుల నుంచి మినహాయింపునిచ్చింది. మరిన్ని వివరాలకు సమీపంలోని ఫిట్‌జీ విద్యాసంస్థను నేరుగా సంప్రదించవచ్చని లేదా www.fiitjee.com/covidsupport.htm ను చూడొచ్చని గురువారం ఓ ప్రకటనలో తెలిపింది.
Published date : 27 Aug 2021 05:36PM