కేజీబీవీ జూనియర్ కాలేజీల భవనాల నిర్మాణానికి నిధులు
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల (కేజీబీవీ)లో ఏర్పాటు చేసిన జూనియర్ కాలేజీల భవనాలను త్వరితగతిన పూర్తిచేయించేందుకు అవసరమైన నిధులను విడతల వారీగా సమగ్ర శిక్ష ద్వారా ప్రభుత్వం విడుదల చేయిస్తోంది.
రాష్ట్రంలోని కేజీబీవీల్లోని 71 జూనియర్ కాలేజీలకు రూ.146.10 కోట్లతో భవనాల నిర్మాణం కోసం సమగ్ర శిక్ష ప్రాజెక్టు అప్రూవల్ బోర్డు ఇంతకు ముందు ఆమోదం తెలిపింది. ఈ పనుల కోసం 40 శాతం నిధులను ముందుగా ప్రభుత్వం విడుదల చేసింది. ఈ భవనాల్లో 55 భవనాల పనులు లెంటిల్ లెవెల్ వరకు చేరడంతో తాజాగా రెండో విడత కింద 26.10 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. మిగతా పనులను కూడా సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయించి విద్యార్థులకు ఆ భవనాల్లో తరగతులను నిర్వహించాలని నిర్ణయించింది.
Published date : 30 Mar 2021 04:16PM