Skip to main content

జనవరి 31న సీటెట్- 2020 పరీక్ష

న్యూఢిల్లీ: కోవిడ్ కారణంగా వాయిదా పడిన సెంట్రల్ టీచర్ ఎలిజబిలిటీ టెస్ట్ (సీటెట్- 2020) పరీక్షను వచ్చే ఏడాది జనవరి 31న నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యా శాఖా మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ ప్రకటించారు.
దేశవ్యాప్తంగా 135 నగరాల్లో ఈ పరీక్షను నిర్వహించనున్నట్టు తెలిపారు. కరోనా కారణంగా పరీక్షా కేంద్రం మార్పునకు అభ్యర్థనలు వచ్చాయని, దాన్ని దృష్టిలో ఉంచుకొని పరీక్షా కేంద్రం మార్పుకి మరో అవకాశం ఇస్తున్నట్లు సీబీఎస్‌ఈ అధికారులు తెలిపారు.
Published date : 05 Nov 2020 03:09PM

Photo Stories