జేఈఈలో 95 శాతం మంది ప్రాధాన్యం ఇంగ్లిష్ మాధ్యమానికే.. మాతృభాషపై అనాసక్తి..!!
Sakshi Education
సాక్షి, అమరావతి: దేశంలో ఇంజినీరింగ్ వంటి వృత్తి, సాంకేతిక విద్యాకోర్సులను సైతం ప్రాంతీయ భాషల్లో బోధించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినా విద్యార్థులు మాత్రం ఆంగ్ల మాధ్యమానికే పెద్దపీట వేస్తున్నారు.
జేఈఈ–2021కు వివిధ భాషల్లో పరీక్ష రాసేందుకు రిజిస్టర్ అయిన విద్యార్థుల సంఖ్య
సాంకేతిక పరిజ్ఞానం అర్థం కావాలంటే ఇంగ్లిషే ముఖ్యం
సాంకేతిక వృత్తి విద్యాకోర్సులకు సంబంధించిన వివిధ అంశాల్లో అత్యున్నత పరిజ్ఞానం కేవలం ఇంగ్లిషులోనే అందుబాటులో ఉంది. సాంకేతిక అంశాలు, పదాలు ఆంగ్లంలో చెప్పడం ద్వారానే విద్యార్థులు అర్థం చేసుకోగలుగుతారు. ఆంగ్ల మాధ్యమంలో చదవడం ద్వారానే విద్యార్థులకు అవి పూర్తిస్థాయిలో అర్థమై అవగాహన చేసుకోగలుగుతున్నారు. జేఈఈ వంటి ప్రవేశ పరీక్షలను ప్రాంతీయ భాషల మాధ్యమంలో రాసేందుకు అవకాశమిచ్చినా విద్యార్థులు మాతృభాషల కన్నా ఆంగ్ల మాధ్యమానికి ప్రాధాన్యమివ్వడానికి కారణం ఇదే.
– ఎస్.ఎ.సికిందర్, ప్రిన్సిపాల్, ప్రభుత్వ జూనియర్ కాలేజీ, కోవూరు, నెల్లూరు జిల్లా
ఇంగ్లిషే విద్యార్థులకు సులభం
తెలుగులోకన్నా విద్యార్థులు ఇంగ్లిష్ మీడియంలోని ప్రశ్నలనే త్వరగా అర్థం చేసుకోగలుగుతున్నారు. సమాధానాల సాంకేతిక పదాలను వెంటనే గుర్తుపట్టి రాయగలుగుతారు. అందుకే ప్రాంతీయ భాషామాధ్యమాల్లో పరీక్ష రాసుకునేందుకు అవకాశమిచ్చినా విద్యార్థులు ఆంగ్లాన్నే ఎంచుకుంటున్నారు. తదుపరి చదువుల్లో కూడా ఆంగ్ల మాధ్యమంలోనే పరిజ్ఞానం ఉంటుంది కనుక వారు ఆంగ్లంలోనే ఈ పరీక్షలు రాయడం మంచిది కూడా. ప్రాంతీయ భాషలను కూడా ప్రోత్సహిస్తున్నామనేందుకు ఆప్షనల్‌గా అవకాశమిచ్చి ఉంటారు. అత్యధికంగా హిందీ మాట్లాడే ప్రాంతీయులు కూడా ఆంగ్లానికే ప్రాధాన్యమిస్తున్నారు.
– ప్రకాశ్, ప్రిన్సిపాల్, చోడవరం, శ్రీకాకుళం జిల్లా
ఇంగ్లిష్ మీడియంతోనే మేలు
ఇంగ్లిష్ మీడియంలో చదవడమే మంచిది. జేఈఈలో వచ్చే ప్రశ్నలన్నీ ఫిజిక్సు, కెమిస్ట్రీ, మేథమెటిక్స్ అంశాలకు సంబంధించినవే. అవన్నీ ఇంగ్లిష్ మాధ్యమంలో చదవడం ద్వారానే సులభంగా అర్థం చేసుకోగలుగుతాం. ఆ సాంకేతిక పదాలకు తెలుగులో అనువదించిన పదాలు అర్థం కావడం చాలా కష్టం. అందుకే ఇంగ్లిష్ మీడియాన్నే ఎంచుకుంటున్నాం. భవిష్యత్తులో ఉన్నత చదువులు కూడా ఇంగ్లిష్ మీడియమే కనుక ఆంగ్ల మాధ్యమం వల్లనే మాకు మంచి జరుగుతుంది.
– జయశ్రీ, ఇంటర్మీడియట్ విద్యార్థిని, కోవూరు జూనియర్ కాలేజీ, నెల్లూరు జిల్లా
ఆయా ప్రాంతీయ భాషా కోర్సుల్లో చేరికలు, అధ్యయనం మాట అటుంచితే వీటిలో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ పరీక్షల్లో సైతం విద్యార్థులు మాతృభాషకన్నా ఆంగ్ల మాధ్యమానికే ప్రాధాన్యమిస్తున్నారు. ఆంగ్ల మాధ్యమంలో ప్రవేశ పరీక్షలను రాస్తున్నవారే అత్యధికంగా అర్హత సాధించడంతోపాటు ఐఐటీ వంటి ఉన్నతసంస్థల్లో సీట్లు పొందుతున్నారు. జేఈఈ–2021 ప్రవేశ పరీక్షను మొదటి నుంచి ఆంగ్లంతోపాటు జాతీయ భాష అయిన హిందీలో కూడా నిర్వహిస్తున్నారు. జేఈఈ–2021 ప్రవేశ పరీక్షలో ఆంగ్లం, హిందీలతోపాటు 11 ప్రాంతీయ భాషా మాధ్యమాల్లో పరీక్ష రాసేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విద్యార్థులకు అవకాశం కల్పించింది. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, గుజరాతీ, ఒడియా, బెంగాలీ, మరాఠీ, పంజాబీ, ఉర్దూ, అస్సామీ భాషల్లో కూడా ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. మాతృభాషలో పరీక్ష రాసే అవకాశమిచ్చినా ఎక్కువమంది ఆంగ్లాన్నే ఎంచుకున్నారు. నాలుగు విడతల్లో నిర్వహించే ఈ పరీక్షకు ఇప్పటివరకు 21 లక్షల రిజిస్ట్రేషన్లు అయ్యాయి. మొత్తం 6.70 లక్షలమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వీరిలో 96 శాతం మంది ఆంగ్ల మాధ్యమానికే ఆప్షన్ ఇచ్చారు. 1,49,597 మంది మాత్రమే 10 స్థానిక భాషల్లో పరీక్షలు రాసేందుకు ఆప్షన్ ఇచ్చినట్లు ఎన్టీఏ గణాంకాలు చెబుతున్నాయి. అందులోను సగం మంది హిందీని ఎంచుకున్నారు. గుజరాతీలో రాసేందుకు 44,094 మంది, బెంగాలీలో రాసేందుకు 24,841 మంది ఆప్షన్లు ఇచ్చారు. ఉత్తరాది రాష్ట్రాల్లో కొందరు మాతృభాషలో రాసేందుకు ప్రాధాన్యమిచ్చినా దక్షిణాదిలో మాత్రం ఆంగ్లంలోనే రాసేందుకు విద్యార్థులు సుముఖత చూపారని ఎన్టీఏ లెక్కలు చూస్తే స్పష్టమవుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 1.50 లక్షలమందికి పైగా ఈ పరీక్షకు హాజరవుతున్నా తెలుగు మాధ్యమాన్ని ఎంచుకున్నది 371 మంది మాత్రమే. మిగిలినవారంతా ఆంగ్ల మాధ్యమంలోనే పరీక్షకు ఆప్షన్ ఇచ్చారు.
ఆదినుంచి ఇంగ్లిష్ వైపే మొగ్గు
ఆదినుంచి ఇంగ్లిష్ వైపే మొగ్గు
- జేఈఈ పరీక్ష రాసేందుకు ఆంగ్ల మాధ్యమంతోపాటు జాతీయ భాష అయిన హిందీలో కూడా ముందునుంచి అవకాశం ఉంది. ఆ సమయంలో కూడా హిందీ ప్రభావిత ప్రాంతాల విద్యార్థులు కూడా ఆంగ్లానికే ప్రాధాన్యమిచ్చారు. హిందీ ప్రభావం లేని దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులు ఆంగ్ల మాధ్యమంలో పరీక్షను రాస్తూ అత్యధిక ఉత్తీర్ణతతో ముందంజలో ఉంటూ వచ్చారు.
- 2011లో 4,68,280 మంది జేఈఈ రాయగా 13,196 మంది అర్హత సాధించారు. ఆ పరీక్షలో 67,706 మంది హిందీకి ఆప్షన్ ఇచ్చారు. హిందీని మాధ్యమంగా ఎంచుకున్న వారిలో 517 (3.92 శాతం) మంది క్వాలిఫై కాగా ఆంగ్లంలో రాసిన వారిలో 12,679 (96.08 శాతం) మంది అర్హులయ్యారు.
- 2012 జేఈఈలో కూడా 85 శాతానికిపైగా ఆంగ్ల మాధ్యమానికే ఆప్షన్ ఇచ్చారు. అర్హత సాధించిన అభ్యర్థుల్లో 94.4 శాతం మంది ఆంగ్ల మాధ్యమ విద్యార్థులే. అప్పట్లోనే వివిధ జోన్లలో హిందీ మాధ్యమాన్ని ఎంచుకున్న అభ్యర్థులు అవకాశాలను కోల్పోయారు. అప్పట్లో ఉమ్మడి ఏపీ నుంచి అందరూ ఆంగ్లంలోనే పరీక్ష రాసి ఉత్తీర్ణులయ్యారు. ఆ పరీక్షల్లో 4,09,793 మంది ఇంగ్లిష్‌లో, 69,858 మంది హిందీలో రాశారు. ఇంగ్లిష్‌లో రాసిన వారిలో 22,762 మంది, హిందీలో రాసినవారిలో 1,350 మంది ఉత్తీర్ణులయ్యారు.
- 2016లో కూడా జేఈఈ అడ్వాన్సులో 2 లక్షలమంది అభ్యర్థుల్లో 12,244 మంది హిందీకి, తక్కిన వారంతా ఆంగ్లానికి ఆప్షన్ ఇచ్చారు. మొత్తం 36,500 మంది అర్హత సాధించారు. వీరిలో హిందీ మాధ్యమ అభ్యర్థులు 1,858 మంది మాత్రమే. మిగిలినవారంతా ఆంగ్ల మాధ్యమ విద్యార్థులే. హిందీ వాడుకభాషగా ఉన్న రాష్ట్రాలు ఉత్తరాదిలో అనేకమున్నా ఆ విద్యార్థుల్లో ఎక్కువశాతం మంది ఆంగ్ల మాధ్యమానికే ప్రాధాన్యమిచ్చారు. ఇక దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులు పూర్తిగా ఆంగ్ల మాధ్యమంలోనే పరీక్షలు రాస్తూ మంచి ఫలితాలను సాధిస్తూ వచ్చారు.
జేఈఈ–2021కు వివిధ భాషల్లో పరీక్ష రాసేందుకు రిజిస్టర్ అయిన విద్యార్థుల సంఖ్య
భాష | విద్యార్థుల సంఖ్య |
తెలుగు | 371 |
తమిళం | 1,264 |
కన్నడ | 234 |
మలయాళం | 398 |
మరాఠీ | 658 |
ఒడియా | 471 |
పంజాబీ | 107 |
ఉర్దూ | 24 |
అస్సామీ | 700 |
బెంగాలీ | 24,841 |
గుజరాతీ | 44,094 |
హిందీ | 76,459 |
సాంకేతిక పరిజ్ఞానం అర్థం కావాలంటే ఇంగ్లిషే ముఖ్యం
సాంకేతిక వృత్తి విద్యాకోర్సులకు సంబంధించిన వివిధ అంశాల్లో అత్యున్నత పరిజ్ఞానం కేవలం ఇంగ్లిషులోనే అందుబాటులో ఉంది. సాంకేతిక అంశాలు, పదాలు ఆంగ్లంలో చెప్పడం ద్వారానే విద్యార్థులు అర్థం చేసుకోగలుగుతారు. ఆంగ్ల మాధ్యమంలో చదవడం ద్వారానే విద్యార్థులకు అవి పూర్తిస్థాయిలో అర్థమై అవగాహన చేసుకోగలుగుతున్నారు. జేఈఈ వంటి ప్రవేశ పరీక్షలను ప్రాంతీయ భాషల మాధ్యమంలో రాసేందుకు అవకాశమిచ్చినా విద్యార్థులు మాతృభాషల కన్నా ఆంగ్ల మాధ్యమానికి ప్రాధాన్యమివ్వడానికి కారణం ఇదే.
– ఎస్.ఎ.సికిందర్, ప్రిన్సిపాల్, ప్రభుత్వ జూనియర్ కాలేజీ, కోవూరు, నెల్లూరు జిల్లా
ఇంగ్లిషే విద్యార్థులకు సులభం
తెలుగులోకన్నా విద్యార్థులు ఇంగ్లిష్ మీడియంలోని ప్రశ్నలనే త్వరగా అర్థం చేసుకోగలుగుతున్నారు. సమాధానాల సాంకేతిక పదాలను వెంటనే గుర్తుపట్టి రాయగలుగుతారు. అందుకే ప్రాంతీయ భాషామాధ్యమాల్లో పరీక్ష రాసుకునేందుకు అవకాశమిచ్చినా విద్యార్థులు ఆంగ్లాన్నే ఎంచుకుంటున్నారు. తదుపరి చదువుల్లో కూడా ఆంగ్ల మాధ్యమంలోనే పరిజ్ఞానం ఉంటుంది కనుక వారు ఆంగ్లంలోనే ఈ పరీక్షలు రాయడం మంచిది కూడా. ప్రాంతీయ భాషలను కూడా ప్రోత్సహిస్తున్నామనేందుకు ఆప్షనల్‌గా అవకాశమిచ్చి ఉంటారు. అత్యధికంగా హిందీ మాట్లాడే ప్రాంతీయులు కూడా ఆంగ్లానికే ప్రాధాన్యమిస్తున్నారు.
– ప్రకాశ్, ప్రిన్సిపాల్, చోడవరం, శ్రీకాకుళం జిల్లా
ఆంగ్ల మాధ్యమంలోనే బాగా అర్థమవుతుంది
ఆంగ్ల మాధ్యమంలోనే ప్రశ్నలను అర్థం చేసుకోవడంతో పాటు త్వరగా సమాధానం రాయగలుగుతున్నాం. అదే ప్రాంతీయ భాషా మాధ్యమాల్లో ఆయా సాంకేతిక పదాలు అర్థం చేసుకోవడం కొంత కష్టం అవుతుంది. చాలాసార్లు సమాధానం ఏంరాయాలో అర్థంగాక అయోమయానికి లోనవుతుంటాం. దీనివల్ల పోటీ పరీక్షల్లో నష్టపోయే అవకాశం ఉంటుంది. కనుక ఇంగ్లిష్ మీడియంలో పరీక్ష రాయడమే మాకు సులభం. అందుకే ఆంగ్ల మాధ్యమానికే ప్రాధాన్యమిస్తున్నాం.
– వంగపండు రితిన్‌చంద్, జేఈఈ–2021 అభ్యర్థి, విజయనగరం
ఇంగ్లిష్ మీడియంతోనే మేలు
ఇంగ్లిష్ మీడియంలో చదవడమే మంచిది. జేఈఈలో వచ్చే ప్రశ్నలన్నీ ఫిజిక్సు, కెమిస్ట్రీ, మేథమెటిక్స్ అంశాలకు సంబంధించినవే. అవన్నీ ఇంగ్లిష్ మాధ్యమంలో చదవడం ద్వారానే సులభంగా అర్థం చేసుకోగలుగుతాం. ఆ సాంకేతిక పదాలకు తెలుగులో అనువదించిన పదాలు అర్థం కావడం చాలా కష్టం. అందుకే ఇంగ్లిష్ మీడియాన్నే ఎంచుకుంటున్నాం. భవిష్యత్తులో ఉన్నత చదువులు కూడా ఇంగ్లిష్ మీడియమే కనుక ఆంగ్ల మాధ్యమం వల్లనే మాకు మంచి జరుగుతుంది.
– జయశ్రీ, ఇంటర్మీడియట్ విద్యార్థిని, కోవూరు జూనియర్ కాలేజీ, నెల్లూరు జిల్లా
Published date : 05 Aug 2021 03:36PM