జేఈఈ, నీట్‌పై వాయిదా కుదరదు: సుప్రీంకోర్టు
Sakshi Education
న్యూఢిల్లీ: ఇంజనీరింగ్, మెడికల్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ, నీట్ పరీక్షల్ని వాయిదా వేయడానికి సుప్రీంకోర్టు మరోసారి నిరాకరించింది.
ఆగస్టు 17నాటి సుప్రీం ఉత్తర్వుల్ని పునః సమీక్షించాలంటూ బీజేపీయేతర పాలనలో ఉన్న ఆరు రాష్ట్రాలు అత్యున్నత న్యాయస్థానంలో వేసిన రివ్యూ పిటిషన్‌ని శుక్రవారం కొట్టివేసింది. జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కృష్ణ మురారి ఆధ్వర్యంలో డివిజన్ బెంచ్ ఈ రివ్యూ పిటిషన్లను పరిశీలించడానికి తగిన అర్హతలు లేవని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో విద్యార్థుల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని పరీక్షల్ని వాయిదా వేయాలంటూ మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, పంజాబ్, రాజస్తాన్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు చెందిన మంత్రులు సుప్రీం తలుపు తట్టారు. సెప్టెంబర్ 1 నుంచే ప్రారంభమైన జేఈఈ పరీక్షలు ఈ నెల 6 వరకు జరగనున్నాయి. నీట్ పరీక్ష ఈ నెల 13న జరగనుంది. ఇప్పటికే 11 రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు పరీక్షల వాయిదా కోరుతూ వేసిన పిటిషన్‌ను ఆగస్టు 17న తోసిపుచ్చింది.
Published date : 05 Sep 2020 12:48PM