జేఈఈ మెయిన్స్ రెండో రోజు పరీక్ష తీరు: ఫిజిక్స్.. మేథ్స్ ఒకింత కష్టం!
Sakshi Education
సాక్షి, అమరావతి: ఐఐటీ, ఎన్‌ఐటీ తదితర విద్యా సంస్థల్లో ప్రవేశానికి సంబంధించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్స్ రెండో రోజైన బుధవారం పరీక్ష ప్రశాంతంగా ముగిసింది.
సుదీర్ఘ కాలిక్యులేషన్స్ తో ఫిజిక్స్ కొంత కఠినం
బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్‌లో ప్రవేశాల కోసం మొదటి రోజైన మంగళవారం రెండు విడతల్లో జేఈఈ మెయిన్‌ను నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ.. బుధవారం బీటెక్‌లో ప్రవేశాల కోసం పరీక్షలను ప్రారంభించింది. మొత్తంగా రాష్ట్రం నుంచి ఈ పరీక్షలకు 67 వేల మందికిపైగా విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్నారు. వారిలో దాదాపు 15 వేల మంది మంగళ, బుధవారాల్లో పరీక్షలకు హాజరయ్యారు. మరో నాలుగు రోజుల పాటు 8 విడతల్లో నిర్వహించే పరీక్షలకు మిగతా విద్యార్థులూ హాజరు కానున్నారు. బుధవారం జరిగిన జేఈఈ మెయిన్ ప్రశ్నలు మొత్తంగా చూస్తే మధ్యస్తంగా ఉన్నట్లు విద్యార్థులు చెబుతున్నారు. విద్యార్థుల నుంచి సేకరించిన సమాచారాన్ని బట్టి.. ఫిజిక్స్‌లో ప్రశ్నలు కొంత కఠినంగా ఉన్నాయని తెలుస్తోందని జేఈఈ సబ్జెక్టు నిపుణులు ఎంఎన్‌రావు, ఉమాశంకర్ తెలిపారు. ఇంకా వీరు చెప్పిన ప్రకారం.. ఫిజిక్స్‌లో సుదీర్ఘ కాలిక్యులేషన్స్ వల్ల విద్యార్థులు కొంత ఇబ్బంది పడ్డారు. ఇందులో ఐదారు ప్రశ్నలు అలాంటివే వచ్చాయి. వేవ్‌స నుంచి డెరైక్ట్ ప్రశ్నలు వచ్చాయి. న్యూక్లియర్ ఫిజిక్స్ నుంచి ఒక్క ప్రశ్నా రాలేదు. ఆటమిక్ ఫిజిక్స్ నుంచి 2 ప్రశ్నలు వచ్చాయి. కెమిస్ట్రీలోనూ కొద్దిగా ప్రశ్నల సరళిలో తేడా ఉన్నా సులభంగా ఉంది. ఎన్‌సీఈఆర్‌టీ అప్లికేషన్స్ సులభమైనవి వచ్చాయి. మెటలర్జీ నుంచి డెరైక్ట్ ప్రశ్నలు వచ్చాయి. రెండు మూడు ఇండెరైక్ట్ ప్రశ్నలు కూడా వచ్చాయి. మ్యాథమెటిక్స్ సులభంగానే ఉంది. ఒక్క ప్రశ్న మాత్రమే సుదీర్ఘమైంది వచ్చింది. ‘మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ ప్రశ్నలు గత జనవరిలో మాదిరిగానే వచ్చాయి. ఎక్కువ శాతం ప్రాథమిక స్థాయి ప్రశ్నలే ఇచ్చారు. కొన్ని మాత్రం లాజికల్ ప్రశ్నలు ఇచ్చార’ని ఈ నిపుణులు వివరించారు.
మంగళవారం బీ.ఆర్క్, బీ.ప్లానింగ్ పరీక్షలు జరగ్గా.. బుధవారం నుంచి బీఈ, బీటెక్ కోర్సుల ప్రవేశానికి కంప్యూటర్ ఆధారిత పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 6 వరకు ఇవి కొనసాగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మొదటి సెషన్, మధ్యాహ్నం 3 గంటల నుంచి రెండో సెషన్ పరీక్షలు జరిగాయి. తొలిరోజు అనుభవంతో రెండో రోజు అధికారులు పరీక్ష కేంద్రాల్లో సమస్యలు లేకుండా మరిన్ని జాగ్రత్తలు చేపట్టారు.
- పేపర్-1 (బీటెక్)లో న్యూమరికల్, బహుళైచ్ఛిక ప్రశ్నలు ఇచ్చారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మేథమెటిక్స్ నుంచి సమాన నిష్పత్తిలో ప్రశ్నలొచ్చాయి.
- పతి విభాగంలో 20 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు, 5 న్యూమరికల్ ప్రశ్నలు అడిగారు.
- పశ్నల డిఫికల్టీ స్థాయిని పరిశీలిస్తే కొత్త తరహాలో అడిగారు. లోతుగా ఆలోచించి పరిష్కరించేలా ఉన్నాయి. కొన్ని ప్రశ్నలు మాత్రం దీర్ఘం (లెంగ్తీ)గా ఉండటంతో వాటిని చదివి అర్థం చేసుకోవడానికి ఇబ్బంది పడినట్టు విద్యార్థులు చెప్పారు. బహుళైచ్ఛిక ప్రశ్నలకు సంబంధించి ఈ సమస్య ఎదురైంది. ఈ ప్రశ్నలకు తప్పు సమాధానాలు ఇస్తే నెగెటివ్ మార్కులు ఉండటంతో బాగా ఆలోచించి సమాధానాలు ఇవ్వాల్సి వచ్చిందని అభ్యర్థులు పేర్కొన్నారు. న్యూమరికల్ ప్రశ్నలకు నెగిటివ్ మార్కులు లేవు. ఫిజిక్స్ పేపర్‌లో ప్రశ్నలు కొంచెం క్లిష్టంగా కనిపించినా ఒకింత సృజనాత్మకంగా ఆలోచించే వారికి అవి సులభంగానే ఉన్నాయి. 14-16 ప్రశ్నలకు సమాధానాలు రాస్తే మంచి పర్సంటైల్‌ను సాధించే అవకాశముందని ఓ అధ్యాపకుడు విశ్లేషించారు.
- కెమిస్ట్రీ ప్రశ్నలు మోడరేట్‌గా జ్ఞాపక ఆధారితం (మెమొరీ బేస్డ్)గా ఉన్నాయని తెలిపారు. ప్రాక్టికల్ కన్నా థియరీ ఆధారిత ప్రశ్నలే ఎక్కువగా వచ్చాయి. ప్రశ్నలు దీర్ఘంగా.. కాలిక్యులేటివ్‌గా ఉండడంతో విద్యార్థులకు కష్టమైంది. మొత్తం ప్రశ్నల్లో 15-17 వరకు సమాధానాలు ఇవ్వగలిగారని కోచింగ్ నిపుణుడొకరు చెప్పారు.
- మొత్తంగా చూస్తే రెండు సెషన్లలో వచ్చిన ప్రశ్నల తీరు మోడరేట్‌గా ఉందని, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పేర్కొన్న సిలబస్‌లోని అన్ని సెక్షన్లను సృ్పశిస్తూ ప్రశ్నలు అడిగారని ఐఐటీ కోచింగ్ అధ్యాపకుడొకరు అభిప్రాయపడ్డారు.
- సెప్టెంబర్ 7న సమాధానాల కీ, సెప్టెంబర్ 11న ఫలితాలను విడుదల చేయనున్నారు. జేఈఈ అడ్వాన్స్ డ్ పరీక్ష నోటిఫికేషన్ అక్టోబర్ 6న వెలువడే అవకాశముంది.
సుదీర్ఘ కాలిక్యులేషన్స్ తో ఫిజిక్స్ కొంత కఠినం
బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్‌లో ప్రవేశాల కోసం మొదటి రోజైన మంగళవారం రెండు విడతల్లో జేఈఈ మెయిన్‌ను నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ.. బుధవారం బీటెక్‌లో ప్రవేశాల కోసం పరీక్షలను ప్రారంభించింది. మొత్తంగా రాష్ట్రం నుంచి ఈ పరీక్షలకు 67 వేల మందికిపైగా విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్నారు. వారిలో దాదాపు 15 వేల మంది మంగళ, బుధవారాల్లో పరీక్షలకు హాజరయ్యారు. మరో నాలుగు రోజుల పాటు 8 విడతల్లో నిర్వహించే పరీక్షలకు మిగతా విద్యార్థులూ హాజరు కానున్నారు. బుధవారం జరిగిన జేఈఈ మెయిన్ ప్రశ్నలు మొత్తంగా చూస్తే మధ్యస్తంగా ఉన్నట్లు విద్యార్థులు చెబుతున్నారు. విద్యార్థుల నుంచి సేకరించిన సమాచారాన్ని బట్టి.. ఫిజిక్స్‌లో ప్రశ్నలు కొంత కఠినంగా ఉన్నాయని తెలుస్తోందని జేఈఈ సబ్జెక్టు నిపుణులు ఎంఎన్‌రావు, ఉమాశంకర్ తెలిపారు. ఇంకా వీరు చెప్పిన ప్రకారం.. ఫిజిక్స్‌లో సుదీర్ఘ కాలిక్యులేషన్స్ వల్ల విద్యార్థులు కొంత ఇబ్బంది పడ్డారు. ఇందులో ఐదారు ప్రశ్నలు అలాంటివే వచ్చాయి. వేవ్‌స నుంచి డెరైక్ట్ ప్రశ్నలు వచ్చాయి. న్యూక్లియర్ ఫిజిక్స్ నుంచి ఒక్క ప్రశ్నా రాలేదు. ఆటమిక్ ఫిజిక్స్ నుంచి 2 ప్రశ్నలు వచ్చాయి. కెమిస్ట్రీలోనూ కొద్దిగా ప్రశ్నల సరళిలో తేడా ఉన్నా సులభంగా ఉంది. ఎన్‌సీఈఆర్‌టీ అప్లికేషన్స్ సులభమైనవి వచ్చాయి. మెటలర్జీ నుంచి డెరైక్ట్ ప్రశ్నలు వచ్చాయి. రెండు మూడు ఇండెరైక్ట్ ప్రశ్నలు కూడా వచ్చాయి. మ్యాథమెటిక్స్ సులభంగానే ఉంది. ఒక్క ప్రశ్న మాత్రమే సుదీర్ఘమైంది వచ్చింది. ‘మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ ప్రశ్నలు గత జనవరిలో మాదిరిగానే వచ్చాయి. ఎక్కువ శాతం ప్రాథమిక స్థాయి ప్రశ్నలే ఇచ్చారు. కొన్ని మాత్రం లాజికల్ ప్రశ్నలు ఇచ్చార’ని ఈ నిపుణులు వివరించారు.
Published date : 03 Sep 2020 12:19PM