జేఈఈ మెయిన్ దరఖాస్తుల్లో పరీక్ష కేంద్రాన్ని మార్చుకోవచ్చు: ఎన్‌టీఏ
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: జేఈఈ మెయిన్ దరఖాస్తుల్లో దొర్లిన పొరపాట్లను సవరించుకునేందుకు విద్యార్ధులకు ఈ నెల 14 వరకు గడువు ఇచ్చిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) వారు తాము పరీక్ష రాయబోయే పరీక్ష కేంద్రాన్ని (పట్టణం) కూడా మార్చుకోవచ్చని పేర్కొంది.
విద్యార్ధులు 14వ తేదీలోపు ప్రతీ రోజు సాయంత్రం 5 గంటలలోపు ఆన్‌లైన్ లో దరఖాస్తు సబ్మిట్ చేయవచ్చని, రాత్రి 11:50 గంటలలోపు ఫీజు చెల్లించాలని వెల్లడించింది. పరీక్ష రాయబోయే పట్టణం మార్చు కోవాలనుకునే వారందరికీ మార్పు జరుగుతుందని కచ్చితంగా చెప్పలేమని, ఆయా పట్టణాల్లోని ఆన్ లైన్ పరీక్ష కేంద్రాలను బట్టి మార్పనకు అవకాశం ఇస్తామని స్పష్టం చేసింది.
Published date : 10 Apr 2020 04:48PM