ఇంకా వెలువడని జేఈఈ మెయిన్ 2021 జనవరి నోటిఫికేషన్: అసలున్నట్టా? లేనట్టా..?
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఏటా రెండు సార్లు నిర్వహించే జేఈఈ మెయిన్‌ను వచ్చే ఏడాది జనవరిలో నిర్వహించే అవకాశం కనిపించడం లేదు.
దేశవ్యాప్తంగా 12వ తరగతి, రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర తరగతుల నిర్వహణ ఆన్‌లైన్‌లో ప్రారంభించినా అంతగా విద్యార్థులకు చేరడం లేదు. మరోవైపు ప్రత్యక్ష విద్యా బోధనను ప్రారంభించలేదు. ఈ నేపథ్యంలో 12వ తరగతి సిలబస్ పూర్తి చేయడం సమస్యగా మారింది. దీంతో జనవరిలో జేఈఈ మెయిన్‌ను నిర్వహించే అవకాశాలు కనిపించడం లేదు.
ముందే నోటిఫికేషన్ ఇవ్వాలి..
2021 జనవరిలో జేఈఈ మెయిన్‌ను నిర్వహించాలంటే ముందుగానే నోటిఫికేషన్‌ను జారీ చేయాల్సి ఉంది. కానీ ఇంతవరకు ఆ దిశగా చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. ఈ ఏడాది జనవరిలో నిర్వహించిన జేఈఈ మెయిన్ కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నోటిఫికేషన్‌ను 2019 ఆగస్టులోనే జారీ చేసింది. సెప్టెంబర్ నెలలో రిజిస్ట్రేషన్లను ప్రారంభించి, జనవరిలో జేఈఈ మెయిన్‌ను నిర్వహించింది. ఈసారి నవంబర్ రెండో వారం వచ్చినా నోటిఫికేషన్‌ను జారీ చేయలేదు. దీంతో జనవరిలో జేఈఈ మెయిన్ నిర్వహించే అవకాశం కనిపించడం లేదు. ఇక రెండో విడత జేఈఈ మెయిన్‌ను సాధారణంగా ప్రతి ఏటా ఏప్రిల్‌లో నిర్వహిస్తోంది. ప్రస్తుతం మొదటి విడత పరీక్షకు చర్యలు చేపట్టనందునా, ఇక 2021 ఏప్రిల్‌లో నిర్వహించాల్సిన రెండో విడత జేఈఈ మెయిన్‌కు జనవరివలో నోటిఫికేషన్ జారీ చేసే అవకాశముంటుందని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. మరోవైపు గత ఏప్రిల్‌లో జరగాల్సిన రెండో విడత జేఈఈ మెయిన్ కూడా ఆలస్యమైంది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించడంతో ఏప్రిల్‌లో నిర్వహిం చాల్సిన జేఈఈ మెయిన్ పరీక్షను గత సెప్టెంబర్‌లో నిర్వహించారు. దీంతో ప్రవేశాల్లోనూ జాప్యమైంది. ఈ పరిస్థితుల్లో వచ్చే ఏడాది జనవరిలో కాకుండా ఏప్రిల్‌లోనే ఒక్కసారే జేఈఈ మెయిన్ పరీక్షనే నిర్వహించే అవకాశముంది.

Published date : 12 Nov 2020 05:09PM