Skip to main content

గుడ్‌న్యూస్: త్వరలోనే 15000 పైగా టీచర్ పోస్టులు భర్తీ

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో టీచర్ ఉద్యోగాలకు ప్రిపేరయ్యే అభ్యర్థులకు శుభవార్త. ప్రభుత్వ టీచర్ కొలువుల నోటిఫికేషన్ల కోసం ఏళ్ల తరబడిగా ఎదురుచూస్తున్న వారి నిరీక్షణ త్వరలో ముగియనుంది.
ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులన్నింటినీ భర్తీ చేసేందుకు త్వరలోనే నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు డిసెంబర్ 13వ తేదీన ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు సేకరించాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను సీఎం ఆదేశించారు.

తెలంగాణ టెట్‌కు సంబంధించిన బిట్‌బ్యాంక్, సిలబస్, స్టడీ మెటీరియల్, మోడల్ పేపర్స్, ప్రివియస్ పేపర్స్, ఆన్‌లైన్ టెస్టులు, ప్రిపరేషన్ గెడైన్స్, జీకే, కరెంట్ అఫైర్స్, ఎఫ్‌ఏక్యూస్, సక్సెస్ స్టోరీల కోసం క్లిక్ చేయండి

15 వేలకు పైగా పోస్టులు..
తెలంగాణలోని పాఠశాలల్లో దాదాపు 15 వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు విద్యాశాఖ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. 2017 సంవత్సరంలో 8,972 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసిన విద్యాశాఖ తాజాగా మరో 15 వేలకు పైగా పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం పాఠశాలల్లో ఉపాధ్యాయ ఖాళీల స్థానాల్లో విద్యా వాలంటీర్లు పనిచేస్తున్నారు. అందులో ప్రధానంగా విద్యార్థులు ఎక్కువగా ఉండి, ఒక్కరిద్దరే టీచర్లు ఉన్న స్కూళ్లు, సబ్జెక్టు టీచర్లు లేని స్కూళ్లలో గతేడాది 15,661 మంది విద్యా వలంటీర్లు పని చేశారు. అంటే ఆ మేరకు ఉపాధ్యాయ ఖాళీలు కచ్చితంగా ఉన్నాయని విద్యాశాఖ వర్గాలు అంచనాకు వచ్చాయి. ఈ నేపథ్యంలో 15వేలకు పైగానే ఉపాధ్యాయ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసే అవకాశం ఉంటుంది.

తెలంగాణ డీఎస్సీ పరీక్షలకు సంబంధించిన బిట్‌బ్యాంక్, సిలబస్, స్టడీ మెటీరియల్, మోడల్ పేపర్స్, ప్రివియస్ పేపర్స్, ఆన్‌లైన్ టెస్టులు, ప్రిపరేషన్ గెడైన్స్, జీకే, కరెంట్ అఫైర్స్, ఎఫ్‌ఏక్యూస్, సక్సెస్ స్టోరీల కోసం క్లిక్ చేయండి
Published date : 14 Dec 2020 12:22PM

Photo Stories