Skip to main content

గ్రామ/వార్డు సచివాలయాల ఉద్యోగులు ఈ పరీక్షలు రాయాల్సిందే..

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయాలు మరింత మెరుగ్గా, సమర్థవంతంగా పని చేసేలా చూడాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు.
సచివాలయ సిబ్బంది పనితీరుపై కచ్చితమైన పర్యవేక్షణ ఉండాలని స్పష్టం చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల పనితీరుపై డిసెంబర్ 23వ తేదీన ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
సిబ్బందికి ఈ పరీక్షలు తప్పనిసరి..
  • గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న సిబ్బందితో పాటు ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు శిక్షణ ఇవ్వాలి. శిక్షణ పూర్తయ్యాక శాఖా పరమైన పరీక్ష నిర్వహించాలి. ఇందులో క్వాలిపై అయితేనే వారికి ప్రొబేషనరీ పీరియడ్ పూర్తవుతుంది. ఇందు కోసం ప్రతి 3 నెలలకొకమారు పరీక్ష నిర్వహించేలా చూడాలి.
  • దేశ వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు ప్రశంసలు వస్తున్నాయని, కేంద్రంతో పాటు పలు రాష్ట్రాలు ఈ వ్యవస్థ గురించి ఆరా తీశాయని.. ఈ సందర్భంగా సిబ్బంది పనితీరు భాధ్యతల గురించి అధికారులు సీఎంకు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రస్తుతం 3.95 లక్షల మంది సిబ్బంది పని చేస్తున్నారని తెలిపారు.
Published date : 24 Dec 2020 05:31PM

Photo Stories