గ్రామ సచివాలయ ఉద్యోగుల వేతనాలకు రూ.600 కోట్లు
Sakshi Education
సాక్షి, అమరావతి: గ్రామ సచివాలయ ఉద్యోగుల వేతనాల నిమిత్తం రూ.600 కోట్లను ఆర్థిక శాఖ విడుదల చేసింది.
గతేడాది అక్టోబర్ 2వ తేదీ నుంచి గ్రామ సచివాలయాలు పనిచేయడం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సచివాలయాల ఉద్యోగుల వేతనాలకు నిధులు విడుదల చేస్తూ ఆర్థిక శాఖ జనవరి 2 (గురువారం)న ఉత్తర్వులు జారీ చేసింది.
Published date : 03 Jan 2020 03:16PM