Skip to main content

గేట్ 2021 దరఖాస్తు గడువు అక్టోబర్ 7 వరకు పొడిగింపు

సాక్షి, హైదరాబాద్: గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్) దరఖాస్తు గడువును అక్టోబర్ 7వరకు పొడిగించారు.
ఈ మేరకు గేట్ నిర్వహణ సంస్థ ఐఐటీ-బాంబే వెల్లడించింది. 2021 ఫిబ్రవరి 5, 6, 7, 12, 13, 14 తేదీల్లో 27 సబ్జెక్టుల్లో ఈ పరీక్షలు నిర్వహించనుంది. జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో ప్రవేశాలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలకు గేట్ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుంటారు.
Published date : 01 Oct 2020 12:50PM

Photo Stories