Skip to main content

గేట్-2020 ఫలితాలు విడుదల...తెలుగు రాష్ట్రాల టాపర్లు వీరే..

సాక్షి, హైదరాబాద్: దేశంలోని ఐఐటీలు, ఇతర జాతీయ స్థాయి ఇంజనీరింగ్ విద్యా సంస్థల్లో ఎంటెక్‌లో ప్రవేశాల కోసం నిర్వహించిన గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్) ఫలితాలు మార్చి 13న విడుదల అయ్యాయి.
విద్యార్థులు వెబ్‌సైట్‌లో లాగిన్ అయి ఫలితాలను పొందవచ్చని గేట్ నిర్వహణ సంస్థ అయిన ఐఐటీ ఢిల్లీ తెలిపింది. ఫిబ్రవరి 1, 2, 8, 9 తేదీల్లో నిర్వహించిన ఈ పరీక్షలను రాసేందుకు దేశ వ్యాప్తంగా 8,58,890 మంది రిజిస్టర్ చేసుకోగా అందులో 6,85,088 (79.76 శాతం) మంది పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో 18.8 శాతం మంది అభ్యర్థులు అర్హత సాధించినట్లు వెల్లడించింది. 100 మార్కులకు నిర్వహించిన ఈ పరీక్షలో అత్యధిక మార్కులను సాధించిన తెలుగు విద్యార్థులు టాప్ 30లో ఉన్నారు. జియో ఫిజిక్స్‌లో ఉపేంద్ర కుమార్ గుప్తా (83 మార్కులు), ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్‌లో నరహరిశెట్టి సాయి సందీప్ (82.33 మార్కులు), మెకానికల్ ఇంజనీరింగ్‌లో వికాస్ కుమార్ (86.88 మార్కులు), ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో (ఈసీఈ) ఎ.పవన్‌కుమార్‌రెడ్డి (82 మార్కులు), ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో కె.భరత్ కుమార్ (81 మార్కులు), మైనింగ్ ఇంజనీరింగ్‌లో ప్రియాంశు మహేశ్వరి (73.33 మార్కులు) అత్యధిక మార్కులు సాధించారు. 25 సబ్జెక్టుల్లో నిర్వహించిన గేట్ స్కోర్‌కు మూడేళ్ల వ్యాలిడిటీ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో గేట్ స్కోర్ ఆధారంగా నియామకాల్లో ప్రాధాన్యం ఇస్తున్నారు. మరోవైపు గేట్ ఫలితాల్లో రాష్ట్ర విద్యార్థులతోపాటు వరంగల్ ఎన్‌ఐటీకి చెందిన విద్యార్థులు ఉత్తమ ర్యాంకులను సాధించారు. సీఎస్‌ఈలో ఎన్‌ఐటీకి చెందిన అబ్బాస్ దాస్ గుప్తా జాతీయ స్థాయిలో 22వ ర్యాంకు సాధించినట్లు వరంగల్ ఎన్‌ఐటీ డెరైక్టర్ ఎన్‌వీ రమణరావు తెలిపారు. ఎంఎంఈలో శశిధర్ గంగవరపు 30వ ర్యాంకు, దీప్ కార్తికేయ 181వ ర్యాంకు, ఈఈఈలో దినేశ్‌రెడ్డి 66వ ర్యాంకు, విష్ణుతేజ 179వ ర్యాంకు, సివిల్‌లో వివేక్ శ్రీవాత్సవ 110 ర్యాంకు, బయోటెక్‌లో దక్ష్‌క్ష్ పమర్ 12వ ర్యాంకు సాధించినట్లు వివరించారు.

గేట్-2020 ఫలితాలకోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి
Published date : 14 Mar 2020 04:50PM

Photo Stories