ఎస్పీఎంవీవీ పీజీసెట్-2020పరీక్ష సమయం మార్పు..!
Sakshi Education
యూనివర్సిటీ క్యాంపస్ (తిరుపతి): శ్రీ పద్మావతి మహిళా వర్సిటీలో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెల 11న ఎస్పీఎంవీవీ పీజీసెట్-2020 నిర్వహిస్తున్నట్లు రెక్టార్ ప్రొఫెసర్ కె.సంధ్యారాణి తెలిపారు.
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, కర్నూలు, తిరుపతి నగరాల్లో ఈ ప్రవేశ పరీక్షలు ఉదయం 9.30 నుంచి 11 గంటల వరకు, మధ్యాహ్నం 12 నుంచి 1.30 గంటల వరకు రెండు సెషన్లలో జరుగుతాయన్నారు. 11వ తేదీ ఉదయం సెషన్‌లో ప్రవేశ పరీక్ష రాయాల్సిన వారు అదే సమయంలో ఇతర వర్సిటీ ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటే.. మధ్యాహ్నం సెషన్‌లో ప్రవేశ పరీక్ష రాయవచ్చునన్నారు. అలాంటి వారు ముందుగా శ్రీపద్మావతి మహిళా వర్సిటీ డెరైక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ డెరైక్టర్ నుంచి అనుమతి పొందాలని పేర్కొన్నారు. అనుమతి కోసం 0877-2284592 నెంబర్‌కు ఫోన్ చేయాలని (లేదా) admnspmvv@gmail.com కు మెయిల్ చేయాలని సూచించారు.
Published date : 10 Oct 2020 12:34PM