ఏప్రిల్ 30న ఏపీ ఈసెట్ పరీక్ష
Sakshi Education
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ఈసెట్ నోటిఫికేషన్ విడుదలైంది.
ఈసెట్ పరీక్ష వివరాలు, తేదీని గురువారం అనంత పురం జేఎన్‌టీయూలో ఏపీ ఈసెట్ చైర్మన్, వీసీ శ్రీనివాసకుమార్, కన్వీనర్ డా.భానుమూర్తి ప్రకటించారు. ఈసారి ఈసెట్‌కు వ్యవసాయ ఇంజనీరింగ్ డిప్లొమా పూర్తిచేసిన వారు కూడా అర్హులని జేఎన్‌టీయూఏ వీసీ శ్రీనివాస కుమార్ తెలిపారు. ఏపీ ఈసెట్ 2020-21 ద్వారా 14 కోర్సుల్లో ఇంజనీరింగ్ రెండో సంవత్సరం ప్రవేశం కల్పిస్తున్నట్లు చెప్పారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 30న పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 135 కేంద్రాల్లో ఈసెట్ పరీక్షను నిర్వహిస్తున్నట్లు పరీక్ష కన్వీనర్ డా.భానుమూర్తి వివరించారు.
Published date : 06 Mar 2020 01:53PM