Skip to main content

ఏపీలో జోరుగా స్పెషలిస్టులు, జీడీఎంవో, స్టాఫ్ నర్సులు, శిక్షణ నర్సులు, పారిశుధ్య సిబ్బంది నియామకాలు

సాక్షి, అమరావతి: కరోనాను ఎదుర్కోవడంలో ముందంజలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్తులో కూడా ఎలాంటి పరిస్థితినైనా దీటుగా ఎదుర్కొనేందుకు పెద్దఎత్తున వైద్య సిబ్బందితోపాటు ఇతర సేవలకు సంబంధించి అదనపు సిబ్బందిని నియమించేందుకు చర్యలు చేపట్టింది.
కోవిడ్-19 సేవల నిమిత్తం స్పెషలిస్ట్ డాక్టర్లు, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్లు (జీడీఎంవో), స్టాఫ్ నర్సులు, శిక్షణ నర్సులు, పారిశుధ్య సిబ్బంది కింద మొత్తం 30,887 మందిని నియమించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇప్పటికే 20,916 మందికి సంబంధించిన నియామక ప్రక్రియ పూర్తయింది. మిగిలిన పోస్టుల భర్తీ ప్రక్రియ కూడా వేగంగా సాగుతోంది. ఆసుపత్రుల్లో అవసరమైన బెడ్లను ప్రభుత్వం ఏర్పాటుచేస్తూనే మరోవైపు ఈ నియామకాలకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇవన్నీ రెగ్యులర్ నియామకాలకు అదనంగా.. ప్రత్యేకించి కోవిడ్-19 కోసం చేపడుతోంది.

జిల్లాల వారీగా పోస్టులు.. నియామకాల వివరాలు..

కేటగిరి

అనుమతి

నియామకం

జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్

2,926

2,192

స్పెషలిస్టులు

1,598

887

అనస్థీషియన్-టెక్నికల్

1,461

1,265

స్టాఫ్ నర్సులు

4,487

4,558

పురుష, మహిళ నర్సులు ఆర్డర్లీ

4,109

4,022

పారిశుధ్య సిబ్బంది

4,394

3,264

డేటాఎంట్రీ ఆపరేటర్లు

712

785

శిక్షణ నర్సులు

11,200

3,943

మొత్తం

30,887

20,916

Published date : 05 Oct 2020 03:34PM

Photo Stories