ఏపీఐసెట్- 2020 తొలివిడత కౌన్సెలింగ్ సీట్ల కేటాయింపు
Sakshi Education
సాక్షి, అమరావతి: ఏపీ ఐసెట్-2020 తొలివిడత కౌన్సెలింగ్‌లో భాగంగా మంగళవారం 16,281 మందికి సీట్ల కేటాయింపు చేసినట్లు సెట్ కన్వీనర్, సాంకేతిక విద్యాశాఖ ప్రత్యేక కమిషనర్ ఎం.ఎం.నాయక్ ఒక ప్రకటన విడుదల చేశారు.
ఐసెట్‌లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సులు నిర్వహించే 432 కాలేజీల్లో కన్వీనర్ కోటాలో సీట్లు 37,195 ఉన్నాయన్నారు. వీటిలో తొలివిడత కౌన్సెలింగ్‌లో 16,281 సీట్లను విద్యార్థులకు కేటాయించినట్లు చెప్పారు. సీట్లు పొందిన విద్యార్థులు ఈనెల 8లోగా సెల్ఫ్ రిపోర్టింగ్‌తో పాటు ఆయా కాలేజీల్లో చేరాలని సూచించారు.
Published date : 03 Feb 2021 05:41PM