Skip to main content

ఏపీ వార్డు సచివాలయాల్లో 2,146 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని పట్టణాలు, నగరపాలక సంస్థల పరిధిలో వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది. వార్డు సచివాలయాల్లో మొత్తం 2,146 ఉద్యోగాల భర్తీకి జనవరి 10న నోటిఫికేషన్‌ జారీ చేసింది.
జనవరి 11 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. దరఖాస్తులకు చివరి తేదీ జనవరి 31. రాత పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా రిజర్వేషన్‌ నిబంధనల మేరకు పోస్టులను భర్తీ చేస్తారు. పూర్తి సమాచారం గ్రామ, వార్డు సచివాలయాల వెబ్‌సైట్ల ద్వారా తెలుసుకోవచ్చని పురపాలక శాఖ కమిషనర్, డైరెక్టర్‌ విజయ్‌కుమార్‌ చెప్పారు.

భర్తీ చేయనున్న వార్డు సచివాలయాల పోస్టుల వివరాలు..
పోస్టు ఖాళీల పోస్టుల సంఖ్య
వార్డు పరిపాలనా కార్యదర్శి 105
వార్డు వసతుల కార్యదర్శి 371
వార్డు పారిశుధ్య, పర్యావరణ కార్యదర్శి 513
వార్డు విద్య, డాటా ప్రాసెసింగ్‌ కార్యదర్శి 100
వార్డు ప్రణాళిక, రెగ్యులేషన్‌ కార్యదర్శి 844
వార్డు సంక్షేమ, అభివృద్ధి కార్యదర్శి 213
మొత్తం 2,146

దరఖాస్తులు చేసుకోవాల్సిన వెబ్‌సైట్లు:
wardsachivalayam.ap.gov.in,
gramasachivalayam.ap.gov.in

ఏపీ వార్డు సచివాలయ ఉద్యోగాల పరీక్షలకు సంబంధించిన స్టడీమెటీరియల్‌, బిట్‌బ్యాంక్, ప్రివియస్‌ పేపర్స్, మాక్‌టెస్టులు, మోడల్‌పేపర్స్, కరెంట్‌ ఆఫైర్స్‌ మొదలైన వాటి కోసం... క్లిక్‌ చేయండి
Published date : 11 Jan 2020 12:27PM

Photo Stories