ఏపీ ప్రవేశ పరీక్షల చైర్మన్లు, కన్వీనర్ల ఖరారు: ఉన్నత విద్యామండలి
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ సాంకేతిక, వృత్తివిద్యా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఏపీసెట్స్–2021కి సంబంధించి చైర్మన్లు, కన్వీనర్లను ఉన్నత విద్యామండలి ఖరారు చేసింది.
ఈ మేరకు కార్యదర్శి ప్రొఫెసర్ బి.సు«దీర్ ప్రేమ్‌కుమార్ మంగళవారం ప్రకటన విడుదల చేశారు. జూలై, ఆగస్టు నెలల్లో ఈ–కామన్ ప్రవేశ పరీక్షలను నిర్వహించనున్నారు.
సెట్ల వారీగా చైర్మన్లు, కన్వీనర్లు ఇలా..
సెట్ల వారీగా చైర్మన్లు, కన్వీనర్లు ఇలా..
సెట్ | వర్సిటీ | చైర్మన్ | కన్వీనర్ |
ఎంసెట్ | జేఎన్టీయూకే | ప్రొ.ఎం.రామలింగరాజు | ప్రొ.వి.రవీంద్ర |
ఈసెట్ | జేఎన్టీయూఏ | ప్రొ.జి.రంగజనార్ధన్ | ప్రొ.సి.శశిధర్ |
ఐసెట్ | ఆంధ్రా వర్సిటీ | ప్రొ.పివీజీడీ ప్రసాదరెడ్డి | ప్రొ.జి.శశిభూషణరావు |
పీజీఈసెట్ | ఎస్వీయూ | ప్రొ.కె.రాజారెడ్డి | ప్రొ.ఆర్వీఎస్ సత్యనారాయణ |
లాసెట్ | ఎస్పీఎం వర్సిటీ | ప్రొ.డి.జమున | ప్రొ.బేబీ చంద్రకళ |
ఎడ్‌సెట్ | ఆంధ్రా వర్సిటీ | ప్రొ.పీవీజీడీ ప్రసాదరెడ్డి | ప్రొ.కె.విశ్వేశ్వరరావు |
ఆర్క్ సెట్ | ఆంధ్రా వర్సిటీ | ప్రొ.పీవీజీడీ ప్రసాదరెడ్డి | ప్రొ.వై.అబ్బులు |
Published date : 03 Mar 2021 05:33PM