Skip to main content

ఏపీ పాలిసెట్-2020లో 84.85 శాతం ఉత్తీర్ణత

సాక్షి, అమరావతి: పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి పాలిసెట్-2020లో 84.85 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.
సాంకేతిక విద్యాశాఖ కార్యాలయంలో శుక్రవారం ఆశాఖ కమిషనర్ ఎం.ఎం.నాయక్‌తో కలసి నైపుణ్యాభివృద్ధి, శిక్షణశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.అనంతరామ్ ఈ ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా అనంతరామ్ మాట్లాడుతూ పరీక్షకు 71,631 మంది హాజరవగా 60,780 మంది ఉత్తీర్ణులైనట్లు చెప్పారు. ఉత్తీర్ణులైన వారిలో బాలురు 42,313 మంది (83.45 శాతం) బాలికలు 18,467 (88.25 శాతం) మంది ఉన్నట్లు తెలిపారు. సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నాయక్ మాట్లాడుతూ పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రస్తుతం 66,742 సీట్లున్నాయని, వీటికి అదనంగా పదిశాతం ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి కేటాయిస్తామని చెప్పారు. 84 ప్రభుత్వ కాలేజీల్లో 16,155 సీట్లు, రెండు ఎయిడెడ్ కాలేజీల్లో 598 సీట్లు, 185 ప్రయివేటు కాలేజీల్లో 49,989 సీట్లు అందుబాటులో ఉన్నాయని వివరించారు. నవంబర్ మొదటి వారంలో పాలిటెక్నిక్ తరగతులను ప్రారంభిస్తామని తెలిపారు. పాలిసెట్ కౌన్సెలింగ్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఆన్‌లైన్ ఫీజు చెల్లించేందుకు ఈనెల 12 నుంచి 16 వరకు గడువు ఉంటుందన్నారు. ఈనెల 14 నుంచి 17 వరకు సర్టిఫికెట్ల పరిశీలన, 12 నుంచి 18 వరకు ఆప్షన్ల నమోదుకు అవకాశం ఉందన్నారు. ఈనెల 20న సీట్లు కేటాయిస్తామని చెప్పారు.

రాష్ట్ర ర్యాంకర్లు వీరే..

ర్యాంకు

విద్యార్థి పేరు

1

మట్టా దుర్గాసాయికీర్తితేజ (ఉండ్రా జవరం, పశ్చిమగోదావరి జిల్లా)

2

సుంకర అక్షయ్‌ప్రణీత్ (కాతేరు, రాజమండ్రి రూరల్, తూర్పుగోదావరి జిల్లా)

3

సవితల శ్రీదత్తశ్యామసుందర్ (కాతేరు, రాజమండ్రి రూరల్, తూర్పుగోదావరి జిల్లా)

4

తంగిరాల శరవణమిత్రసోమ (కాతేరు, రాజమండ్రి రూరల్, తూర్పుగోదావరి జిల్లా)

5

గుణుపూరు వి.ఎస్.నీహారిక (భీమిలి, విశాఖపట్నం జిల్లా)

5

సాదనాల సంజనరామ్ (మామిడికుదురు, తూర్పుగోదావరి జిల్లా)

5

మరివాడ శ్రీసాత్విక (కాతేరు, రాజమండ్రి రూరల్, తూర్పుగోదావరి జిల్లా)

8

ఇవటూరి నాగసూర్యశ్రీకర్‌ప్రాణ (కాతేరు, రాజమండ్రి రూరల్, తూర్పుగోదావరి జిల్లా)

9

గారపాటి షణ్ముఖవిశాల్ (కాతేరు, రాజమండ్రి రూరల్, తూర్పుగోదావరి జిల్లా)

10

కొడిబోయిన లీలావర్షిణి (కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా)

10

తానేటి నవీణర్హేమా (తణుకు, పశ్చిమగోదావరి జిల్లా)

10

డేగల చంద్రసాయిశేఖర్ (కాతేరు, రాజమండ్రి రూరల్, తూర్పుగోదావరి జిల్లా)

Published date : 10 Oct 2020 12:39PM

Photo Stories