ఏపీ గ్రామ,వార్డు సచివాలయ పరీక్షల షెడ్యూల్ విడుదల
Sakshi Education
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో సెప్టెంబర్ 20 నుంచి సచివాలయ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభమవుతుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.
ఆగస్టు 12వ తేదీన విజయవాడలో పంచాయతిశాఖ మంత్రి కార్యాలయంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగల భర్తీపై ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమవేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. సెప్టెంబర్ 20 నుంచి సచివాలయ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభమై వారం రోజుల పాటు నిర్వహిస్తామన్నారు. సుమారు 10లక్షల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరవుతారని అంచనా వేస్తున్నామని తెలిపారు. తొలిరోజే సుమారు 4.5లక్షల మంది వరకు పరీక్షలు రాస్తారని పేర్కొన్నారు. దాదాపు 3నుంచి 5వేల పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. కోవిడ్ నేపథ్యంలో భౌతికదూరం పాటిస్తూ పరీక్షలు రాసేలా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎక్కువగా ఖాళీలు ఉన్న పశుసంవర్థక అసిస్టెంట్ పోస్ట్ల భర్తీపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. అత్యంత పారదర్శకంగా పరీక్షల నిర్వహణ ఉండాలని అధికారులకు తెలిపారు. కార్యక్రమంలో మంత్రి బొత్స సత్యనారాయణ, పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్, ఏపీపీఎస్సీ, పురపాలకశాఖ, వ్యవసాయ, పశుసంవర్థకశాఖ అధికారులు పాల్గొన్నారు.
ఏపీ గ్రామ,వార్డు సచివాలయ పరీక్షలు-2020 మోడల్పేపర్స్, సిలబస్, స్టడీమెటీరియల్, ప్రీవియస్ పేపర్స్, ఉచిత ఆన్లైన్ టెస్టులు, కరెంట్ అఫైర్స్ మొదలైన వాటి కోసం క్లిక్ చేయండి
ఏపీ గ్రామ,వార్డు సచివాలయ పరీక్షలు-2020 మోడల్పేపర్స్, సిలబస్, స్టడీమెటీరియల్, ప్రీవియస్ పేపర్స్, ఉచిత ఆన్లైన్ టెస్టులు, కరెంట్ అఫైర్స్ మొదలైన వాటి కోసం క్లిక్ చేయండి
Published date : 12 Aug 2020 07:16PM