Skip to main content

ఏపీ గ్రామ సచివాలయాల్లో 14,061 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామ సచివాలయాల్లో 14,061 ఉద్యోగాల భర్తీకి పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ గిరిజా శంకర్‌ జనవరి 10న నోటిఫికేషన్‌ జారీ చేశారు. అర్హులైన అభ్యర్థులు జనవరి 11 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
జనవరి 31 వ తేదీ అర్ధరాత్రి వరకు దరఖాస్తులకు తుది గడువు అని అధికారులు చెప్పారు. గత ఏడాది ఆగస్టు–సెప్టెంబరులో దాదాపు 1.34 లక్షల సచివాలయ ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేసిన విషయం తెలిసిందే. ఆ నోటిఫికేషన్లలో పోస్టుల వారీగా పేర్కొన్న విద్యార్హతలే ఇప్పుడు కూడా వర్తిస్తాయని అధికారులు తెలిపారు. ఇప్పటికే సర్వీసులో ఉన్న అభ్యర్థులకు కొన్ని ఉద్యోగాల విషయంలో 10 శాతం మార్కుల వెయిటేజీ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. గ్రామ సచివాలయాల్లో పోస్టుల భర్తీకి రాత పరీక్షను మార్చి తర్వాత నిర్వహించే అవకాశం ఉందన్నారు. నోటిఫికేషన్‌లో పేర్కొన్న పోస్టుల సంఖ్య పెరిగే వీలుందన్నారు.

పోస్టుల వారీగా ఖాళీల వివరాలు...
పోస్టు ఖాళీల సంఖ్య
పంచాయతీ కార్యదర్శి గ్రేడ్‌–5 61
వీఆర్వో గ్రేడ్‌–2 246
ఏఎన్‌ఎం గ్రేడ్‌–3 648
గ్రామ మత్స్య శాఖ అసిస్టెంట్‌ 69
గ్రామ ఉద్యానవన శాఖ అసిస్టెంట్‌ 1,782
గ్రామ వ్యవసాయ శాఖ సహాయకుడు గ్రేడ్‌–2 536
గ్రామ సెరికల్చర్‌ సహాయకుడు 43
గ్రామ సంరక్షణ కార్యదర్శి 762
ఇంజనీరింగ్‌ సహాయకుడు 570
డిజిటల్‌ అసిస్టెంట్‌ 1134
విలేజ్‌ సర్వేయర్‌ గ్రేడ్‌–3 1,255
వెల్ఫేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్‌ 97
పశు సంవర్దక శాఖ సహాయకుడు 6,858
మొత్తం 14,061
 
Published date : 11 Jan 2020 12:15PM

Photo Stories