Skip to main content

ఏపీ ఎంసెట్-2020రెండో విడతలో 12,274 మందికి సీట్లు.. మిగిలిన సీట్లుఎన్నంటే..

సాక్షి, అమరావతి : ఏపీ ఎంసెట్-2020 రెండో విడత కౌన్సెలింగ్‌లో సోమవారం కన్వీనర్ కోటాలో సీట్ల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేసినట్టు కన్వీనర్, సాంకేతిక విద్యా శాఖ ప్రత్యేక కమిషనర్ నాయక్ తెలిపారు.

రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మా కోర్సులున్న కాలేజీలు 439 ఉండగా.. వాటిలో 1,04,228 సీట్లు ఉన్నట్టు చెప్పారు. రెండో విడత కేటాయింపుల అనంతరం మొత్తం 76,358 సీట్లు భర్తీ కాగా, 27,870 సీట్లు మిగిలినట్టు తెలిపారు.

సీట్ల కేటాయింపు ఇలా

అర్హులైన అభ్యర్థులు:

1,29,880

రెండో విడతకు రిజిస్టరైనవారు:

1,081

1, 2 విడతలకు కలిపి రిజిస్టరైనవారు:

91,099

ధ్రువపత్రాల పరిశీలనకు హాజరైనవారు :

90,215

2వ విడతలో ఆప్షన్లు నమోదు చేసిన వారు:

52,360

మొదటి విడత సీట్లు వచ్చి.. రెండో విడత కౌన్సెలింగ్‌లో పాల్గొన్నవారు:

12,630

రెండో విడతలో కొత్తగా సీట్లు పొందిన వారు:

12,274


రెండు విడతల్లో వర్సిటీ
, ప్రైవేటు కాలేజీలు, కోర్సుల వారీగా కన్వీనర్ కోటా సీట్ల కేటాయింపు ఇలా..

విభాగం

వర్సిటీ కాలేజీలు

ప్రైవేటు కాలేజీలు

మిగులు

సీట్లు

భర్తీ

సీట్లు

భర్తీ

ఇంజనీరింగ్

6,035

5,722

93,385

70,263

23,435

ఫార్మసీ

286

79

3,847

266

3,788

ఫార్మా డీ

6

8

659

20

647

Published date : 26 Jan 2021 04:19PM

Photo Stories