ఏఎన్‌యూ పీజీసెట్- 2020 ఫలితాలు విడుదల
Sakshi Education
ఏఎన్‌యూ (గుంటూరు): ఏఎన్‌యూ పీజీసెట్-2020 ప్రవేశ పరీక్ష ఫలితాలను బుధవారం ఏఎన్‌యూ వీసీ ఆచార్య పి.రాజశేఖర్ విడుదల చేశారు.
అభ్యర్థులు ర్యాంకు కార్డులను డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ.ఏఎన్‌యూ.డీవోఏ.ఇన్ వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వీసీ మాట్లాడుతూ..రాష్ట్రంలో కోవిడ్-19 లాక్‌డౌన్‌లో పీజీ కోర్సుల్లో అడ్మిషన్లకు ప్రవేశ పరీక్షలు నిర్వహించిన మొట్టమొదటి యూనివర్సిటీ ఏఎన్‌యూ అని తెలిపారు. పీజీ కౌన్సెలింగ్‌నూ అందరికంటే ముందుగానే నిర్వహిస్తామని చెప్పారు. రెక్టార్ ఆచార్య పి.వరప్రసాదమూర్తి, రిజిస్ట్రార్ ఆచార్య కె.రోశయ్య పాల్గొన్నారు.
Published date : 15 Oct 2020 02:48PM