‘డీఎస్సీ-98 క్వాలిఫైడ్‌లకు ఉద్యోగాలివ్వండి’
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలల్లో 4,796 ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఎంహెచ్‌ఆర్‌డీ లెక్క తేల్చిన నేపథ్యంలో డీఎస్సీ-1998 క్వాలిఫైడ్ అభ్యర్థులకు ఉద్యోగాలివ్వాలని 1998 డీఎస్సీ సాధన సమితి అధ్యక్షుడు శ్రీనివాస్ సీఎం కేసీఆర్‌కు ఒక ప్రకటనలో విజ్ఞప్తిచేశారు.
నల్లగొండ, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల నుంచి హైకోర్టులో పిటిషన్లు వేసినవారందరికీ వెంటనే ఉద్యోగాలివ్వాలని కోరారు. అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, హైకోర్టు తీర్పులపై సీఎం స్పందించి న్యాయం చేయాలన్నారు.
‘సీఏఎస్’ ప్రొవిజనల్ మెరిట్ లిస్టు పూర్తి
సాక్షి, అమరావతి: సివిల్ అసిస్టెంట్ సర్జన్ (సీఏఎస్), డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల ప్రొవిజనల్ మెరిట్ జాబితాను నేడు కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ (సీఎఫ్‌డబ్ల్యూ) పోర్టల్‌లో పెట్టనున్నట్టు ఏపీ వైద్య విధానపరిషత్ కమిషనర్ తెలిపారు. అభ్యంతరాలున్న వారికి ఆగస్టు 16 వరకూ గడువు ఇచ్చారు. ప్రొవిజనల్ మెరిట్ జాబితాను cfw.ap.nic.inలో చూసుకోవచ్చు.
Published date : 11 Aug 2020 02:16PM