డీఎడ్ విద్యార్థులకు సొంత జిల్లాల్లో పరీక్షలు రాసేందుకు అనుమతి
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: కరోనా నేపథ్యంలో ఉపాధ్యాయ విద్యను అభ్యసిస్తున్న డీఎడ్ విద్యార్థులు తమ సొంత జిల్లాల్లోనే పరీక్షలు రాసుకునే వెసులుబాటు కల్పించాలని ఏబీవీపీ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు.
ఈ మేరకు గురువారం ప్రభుత్వ పరీక్షల విభాగం డెరైక్టర్ సత్యనారాయణరెడ్డిని కలిసి వినతి పత్రాన్ని సమర్పించా రు. దీనిపై స్పందించిన అధికారులు విద్యార్ధులు దరఖాస్తు చేసుకుంటే వారి సొంత జిల్లా కేంద్రాల్లో పరీక్షలు రాసేందుకు అనుమతిస్తామని పేర్కొన్నారు.
Published date : 20 Nov 2020 04:11PM