Skip to main content

ఔత్సాహిక ఐఏఎస్‌ల కోసం... ఐఏఎస్ అధికారి రచనలు!

తిరువనంతపురం: కేరళకు చెందిన దివ్య ఎస్ అయ్యర్ డాక్టర్ నుంచి ఐఏఎస్ అధికారిగా ఎదిగారు.
ఇందుకు ప్రధాన కారణం ఆమె పట్టుదలే. నిజానికి 2012లోనే దివ్య మొదటి సివిల్ సర్వీసెస్ పరీక్షకు హాజరై 139వ ర్యాంకు సాధించారు. అయితే అది ఆమెకు సంతృప్తి ఇవ్వలేదు. దీంతో, 2014లో మరో సారి ప్రయత్నించాలని నిర్ణయించుకున్నారు. ఈసారి పట్టుదలతో వివిధ పద్ధతులను అవలంబించి ఈ పర్యాయం 48వ ర్యాంకు సాధించి అఖిల భారత స్థాయిలో ర్యాంకు సాధించి తన సత్తా చాటారు. ప్రస్తుతం ఆమె మిషన్ డెరైక్టర్‌గా విధులు నిర్వహిస్తు న్నారు. కర్తవ్య నిర్వహణలో భాగంగా పేద ప్రజలకు సేవ చేస్తూనే ఔత్సాహిక ఐఏస్‌ఎస్‌ల కోసం రచయితగా మారారు. తన విజయరహస్యానికి సంబం దించిన చిట్కాలకు పుస్తకం రూపమిస్తున్నారు. ప్రతి సంవత్సరం సిలబస్ మారుతుంది. ఈ నేపథ్యంలో అర్ధం చేసుకునేందుకు వీలుగా ‘పాత్‌ఫైండర్’ పేరుతో ప్రతి సంవత్సరం పుస్తకాలు రాస్తున్నారు. ఈ పుస్తకాల ద్వారా ఎంతో మంది తమ గమ్యానికి చేరు కోగలుగుతున్నారు.

ఇక దివ్య పుస్తక రూపంలో ఔత్సాహికులకు అందించిన చిట్కాలు తెలుసుకుందాం.
  • ఏమి చేయాలనుకుంటున్నారనే దానిపై చాలా స్పష్టంగా ఉండండి, దానిని సాధించడానికి స్థిరంగా పని చేయండి.
  • పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వ్యక్తులతో మాట్లాడి, వారు ఏమి చేశారో ఏమి చేయలేదో తెలుసుకోండి.
  • ఒక విషయంపై పూర్తి జ్ఞానాన్ని సంపాదించడానికి కృషి చేయండి.
  • స్వీయ క్రమశిక్షణను అలవరుచుకోండి.

ఒక రోజులో ముగిసేది కాదు..
‘‘ఐఏఎస్ ఒక దీర్ఘకాలిక ప్రక్రియ. ఒక రోజులో ముగిసే ఇతర ప్రధాన పరీక్షల మాదిరిగా కాదు. అందు కే శ్రమ, పట్టుదలతోపాటు కుటుంబ మద్దతు మంచి ఉపాధ్యాయుల ప్రోత్సాహం, మంచి ఆహారం వంటివి ఉంటేనే ఏదైనా సాధ్యమవుతుంది’’
- డాక్టర్ అయ్యర్
Published date : 28 Jan 2020 03:04PM

Photo Stories