Skip to main content

అసిస్టెంట్‌ ఇన్‌స్పెక్టర్‌ ఉద్యోగాలు పొందిన వారి జాబితా విడుదల

సాక్షి, అమరావతి: అసిస్టెంట్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫిషరీస్‌ పోస్టులకు ఎంపికైన వారి జాబితాను ఏపీపీఎస్సీ సోమవారం విడుదల చేసింది.
కమిషన్‌ వెబ్‌సైట్లో దీనిని పొందుపరిచినట్టు కమిషన్‌ కార్యదర్శి పీఎస్సార్‌ ఆంజనేయులు తెలిపారు. వీటిలో 3 పోస్టులకు అర్హులైన అభ్యర్థులు లేనందున అవి భర్తీ చేయడం లేదు. వాటిని త్వరలోనే తిరిగి నోటిఫై చేయనున్నట్టు తెలిపారు.
Published date : 23 Mar 2021 03:11PM

Photo Stories