Skip to main content

AP NIT MTech 2021 admissions: నేటి నుంచి ‘నిట్‌’లో ఎంటెక్‌ విద్యార్థుల డాక్యుమెంట్ల పరిశీలన

తాడేపల్లిగూడెం: ఏపీ నిట్‌లో ఎంటెక్‌ చదవనున్న విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమం ఆగస్టు 30,31 తేదీల్లో నిర్వహించనున్నట్లు నిట్‌ అధికారులు తెలిపారు.
ఎంటెక్‌ రెండో బ్యాచ్‌కి సంబంధించి 85 మంది విద్యార్థులు ఉన్నారని చెప్పారు. వీరికి సెప్టెంబర్‌ 1 నుంచి ఫిజికల్‌గా తరగతులు నిర్వహించాలని తాడేపల్లిగూడెం నిట్‌ యాజమాన్యం నిర్ణయించినట్లు చెప్పారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ కోసం పదో తరగతి మార్కుల లిస్టు, జనన ధ్రువపత్రం, 12వ తరగతి/డిప్లమో మార్కుల జాబితా, ఒరిజినల్‌ డిగ్రీ ప్రొవిజినల్, మార్కుల జాబితా, గేట్‌ స్కోర్‌ కార్డు, కుల ధ్రువీకరణ పత్రాలు, కేంద్ర ప్రభుత్వ ఫార్మాట్‌లో ఈ ఏడాది ఏప్రిల్‌ 1 తర్వాత జారీ చేసిన ఈడబ్ల్యూఎస్‌ సర్టిఫికెట్, టీసీ, మైగ్రేషన్‌ సర్టిఫికెట్, 2 పాస్‌పోర్ట్‌ సైజు ఫొటోలు, సీట్‌ అలాట్‌మెంట్‌ కాపీ, ఆధార్, ఫొటో గుర్తింపు కార్డు, ఎస్‌బీఐ ఖాతా పాస్‌బుక్‌ జిరాక్స్‌ కాపీ, ఒరిజినల్‌ సర్టిఫికెట్ల జిరాక్సు కాపీలు రెండు సెట్లు వెంట తెచ్చుకోవాలని అధికారులు వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.
Published date : 30 Aug 2021 03:33PM

Photo Stories