అక్టోబర్ 9న లాసెట్- 2020 పరీక్ష
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: టీఎస్ లాసెట్-20 వచ్చేనెల 9వ తేదీన నిర్వహించనున్నట్లు సెట్ కన్వీనర్ జీబీ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఇదే రోజున పీజీ లాసెట్-20 పరీక్ష కూడా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి, సంబంధిత అధికారులు సమీక్ష నిర్వహించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ పరీక్షలకు సంబంధించి ఫీజును ఈనెల 20వ తేదీ వరకు రూ.4వేల అపరాధ రుసుముతో చెల్లించవచ్చని సూచించారు. మరిన్ని వివరాలకు సెట్ వెబ్‌సైట్‌ను సందర్శించాలన్నారు.
Published date : 11 Sep 2020 02:41PM