అక్టోబర్ 10,11న ఏఎన్‌యూ పీజీ సెట్ ప్రవేశ పరీక్షలు
Sakshi Education
ఏఎన్‌యూ (గుంటూరు): ఆచార్య నాగార్జున వర్సిటీ పరిధిలోని పీజీ కళాశాలలు, ఒంగోలులోని ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం వర్సిటీలో పీజీ కోర్సుల్లో 2020-21 విద్యా సంవత్సరంలో ప్రవేశానికి నిర్వహిస్తున్న పీజీ సెట్ తేదీలు ఖరారు చేసినట్లు వర్సిటీ అడ్మిషన్ల డెరైక్టర్ డాక్టర్ బి.హరిబాబు బుధవారం తెలిపారు.
అక్టోబర్ 10, 11 తేదీల్లో సబ్జెక్టుల వారీగా ప్రవేశ పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. గుంటూరు, ఒంగోలు, విజయవాడ, రాజమండ్రి, విశాఖ, నరసరావుపేట, మాచర్ల, బాపట్ల, మార్కాపురంలో ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. పరీక్ష కేంద్రం మార్చుకోదలచుకున్న విద్యార్థులు ఈనెల 30లోగా వర్సిటీ వెబ్‌సైట్‌లో తమకు కావాల్సిన కేంద్రాన్ని ఎంపిక చేసుకోవాలని సూచించారు. ఏఎన్‌యూ పీజీసెట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 30 వరకు గడువు పొడిగించామన్నారు. రూ.500 ఆలస్య రుసుంతో అక్టోబర్ 5 వరకు ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు.
Published date : 24 Sep 2020 04:21PM