ఐబీపీఎస్ ఉచిత శిక్షణకు ఎంపిక పరీక్ష
Sakshi Education
సాక్షి, అమరావతి: బ్యాంకు ఉద్యోగాల (ఐబీపీఎస్) పరీక్షలకు ఉచిత కోచింగ్ కోసం ఆదివారం ఆన్లైన్ ద్వారా ఎంపిక పరీక్షను నిర్వహించినట్టు ఏపీ స్టడీ సర్కిల్ సంచాలకుడు ఉసురుపాటి వెంకటేశ్వర్లు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.
సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలో 150 మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను ఎంపిక చేసి వారికి ఉచితంగా బ్యాంకు పరీక్షల కోసం శిక్షణ ఇస్తామన్నారు. ఇందుకోసం దరఖాస్తులు ఆహ్వానించగా 1,022 మంది ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారని, వారిలో 818 మంది హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారని తెలిపారు. పరీక్షకు హాజరైన అభ్యర్థుల్లో ప్రభుత్వ నిబంధనల మేరకు ఎంపిక చేసి వారికి రానున్న మూడు నెలల్లో ఉచిత ఆన్‌లైన్ శిక్షణ ఇస్తామని వివరించారు.
Published date : 02 Aug 2021 03:00PM