295 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల తుది జాబితా విడుదల
Sakshi Education
సాక్షి, అమరావతి: పలు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పనిచేసేందుకుగాను అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల నియామక ప్రక్రియ తుది అంకానికి చేరింది.
ఎంబీబీఎస్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగులుగా చేరి ఆ తర్వాత ఇన్‌సర్వీస్ కోటాలో పీజీ చేసిన వారికి బోధనాస్పత్రుల్లో అవకాశం ఇస్తారు. దీన్నే లేటరల్ ఎంట్రీ అంటారు. ఖాళీ అయిన ఎంబీబీఎస్ పోస్టుల భర్తీని ప్రజారోగ్య శాఖ భర్తీ చేస్తుంది. ఇలా లేటరల్ ఎంట్రీకి వచ్చిన దరఖాస్తులను అభ్యంతరాలు, వడపోత అనంతరం గురువారం రాత్రి డీఎంఈ వెబ్‌సైట్‌లో పెట్టారు. 295 పోస్టులను లేటరల్ ఎంట్రీలో భర్తీ చేస్తున్నారు. మొత్తం 32 విభాగాలకు సంబంధించి జాబితాను సిద్ధం చేసి డీఎంఈ వెబ్‌సైట్‌లో ఉంచినట్లు డీఎంఈ డా.వెంకటేష్ చెప్పారు. వీరికి పోస్టింగ్ ఆప్షన్లు ఇచ్చి, దాని మేరకు నియామక పత్రాలు ఇవ్వనున్నట్లు చెప్పారు.
Published date : 21 Aug 2020 01:52PM