1999 గ్రూప్-2 కేసు విచారణ వాయిదా
Sakshi Education
సాక్షి, న్యూఢిల్లీ: 1999 గ్రూప్-2 నియామకాల్లో సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయలేదంటూ దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది.
జస్టిస్ ఉదయ్ లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు మార్చి 3 (మంగళవారం)న పిటిషన్ విచారణకు రాగా ఏపీపీఎస్సీ నుంచి మరిన్ని వివరాలు తీసుకోవాల్సి ఉందని, అఫిడవిట్ దాఖలు చేసేందుకు మరికొంత సమయం కావాలని ఏపీ ప్రభుత్వ న్యాయవాది జి.నాగేశ్వరరెడ్డి ధర్మాసనాన్ని కోరారు. దీనికి సమ్మతించిన ధర్మాసనం తదుపరి విచారణను మార్చి 17కు వాయిదావేసింది.
Published date : 04 Mar 2020 02:36PM