Skip to main content

1.4 లక్షల ఉద్యోగాల కోసం రైల్వే పరీక్షలు... ఎప్పటినుంచంటే..

న్యూఢిల్లీ: 1.4 లక్షల ఉద్యోగాల కోసం కంప్యూటర్ బేస్డ్ పరీక్ష (సీబీటీ)ను నిర్వహించేందుకు రైల్వే శాఖ సిద్ధమైంది.
దాదాపు 2.44 కోట్ల మంది అభ్యర్థులు ఈ పరీక్ష కోసం ఎదురు చూస్తున్నారు. పరీక్షను మూడు దశల్లో జరపనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. మొదటి దశ ఈ నెల 15 నుంచి 18 వరకూ, రెండో దశ ఈ నెల 28 నుంచి వచ్చే ఏడాది మార్చి వరకూ, మూడో దశ 2021 జూన్‌లోగా ముగుస్తుందని తెలిపింది. పరీక్షకు నాలుగు రోజుల ముందు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకొనే సదుపాయం కల్పిస్తామని చెప్పింది.

Must Check: RRB Group D and NTPC Free Model Papers

పరీక్షలను పూర్తి స్థాయి కోవిడ్ 19 నిబంధనలతో నిర్వహిసు ్తన్నామ ని, అభ్యర్థుల ఉష్ణోగ్రత మొదలుకొని మాస్కులు, శానిటైజర్లు, భౌతికదూరాలను తప్పనిసరి చేసినట్లు చెప్పింది. పరీక్ష సెంటర్లను అభ్యర్థులకు దగ్గరగా ఉండేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. అభ్యర్థుల కోసం ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు చెప్పింది.
Published date : 12 Dec 2020 03:31PM

Photo Stories