Skip to main content

ఆగస్టులో ఏపీసెట్ - 2013.. ఏపీసెట్ సభ్య కార్యదర్శి ప్రొ. బి.రాజేశ్వరరెడ్డి

మన రాష్ర్టంలో డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్, విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల నియామక పరీక్షలకు అర్హత సాధించాలంటే ప్రామాణిక పరీక్ష.. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (ఏపీసెట్). తొలిసారి గతేడాది నిర్వహించిన ఏపీసెట్‌కు మరికొద్ది రోజుల్లో నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో ఏపీసెట్ సభ్య కార్యదర్శి ప్రొ. బి.రాజేశ్వరరెడ్డితో భవిత ప్రత్యేక ఇంటర్వ్యూ..

గతంలో స్లెట్‌గా:
ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సెట్)ను గతంలో స్టేట్ లెవల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (స్లెట్) పేరుతో ఏపీపీఎస్సీ నిర్వహించేది. డిగ్రీ కళాశాలల అధ్యాపకుల భర్తీకి తగిన అర్హతలున్న అభ్యర్థులు లేరని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం 14 ఏళ్ల తర్వాత సెట్ నిర్వహణ బాధ్యతలను ఉస్మానియా విశ్వవిద్యాలయానికి అప్పగించింది. తొలిసారి సమర్థవంతంగా నిర్వహించినందుకుగాను వరుసగా మూడుసార్లు 2013, 2014, 2015 సెట్ నిర్వహణ బాధ్యతలను కూడా ఓయూనే దక్కించుకుంది.

జూన్ మూడోవారంలో ఏపీసెట్-2013 ప్రకటన:
ఏపీసెట్-2013 నిర్వహణకు అంతా సిద్ధం చేశాం. జూన్ మూడో వారంలో ప్రకటనను విడుదల చేస్తాం. ఆగస్టు చివరి వారం లేదా సెప్టెంబరు మొదటి వారంలో ఏపీసెట్ పరీక్ష ఉంటుంది.

నిష్ణాతులైన అభ్యర్థుల ఎంపికకే సెట్:
డిగ్రీ కళాశాలల్లో నాణ్యత ప్రమాణాలతో కూడిన విద్యా బోధనకు సంబంధిత సబ్జెక్టులో విషయ పరిజ్ఞానం ఉన్న నిష్ణాతులైన అభ్యర్థులకు అర్హత ప్రమాణాలను నిర్దేశించే లక్ష్యంతో ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో ఏపీసెట్‌ను నిర్వహిస్తోంది. ఇందులో అర్హత సాధించినవారు డిగ్రీ కళాశాలల లెక్చరర్, విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నిర్వహించే నియామక పరీక్షలకు హాజరుకావచ్చు. భవిష్యత్తులో జూనియర్ కళాశాలల లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి సైతం ఏపీసెట్ అర్హతను ప్రవేశపెట్టనున్నందున ఈ సారి దరఖాస్తు చేసుకునేవారి సంఖ్య 1.50 లక్షల వరకు పెరిగే అవకాశం ఉంది.

కొత్తగా ఐదు సబ్జెక్టులు.. రెండు తొలగింపు:
ఏపీసెట్-2013లో కొత్తగా ఐదు సబ్జెక్టులను చేర్చాం. గత ఏడాది నిర్వహించిన ఆంత్రోపాలజీ, లింగ్విస్టిక్స్ సబ్జెక్టులను తొలగించాం. వీటికి విద్యార్థుల నుంచి అంతగా ఆదరణ లేదు. కొత్తగా జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, జియోగ్రఫీ, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, సంస్కృతం, సోషల్ వర్క్ సబ్జెక్టులను ప్రవేశపెట్టనున్నాం. 2012లో మొత్తం 24 సబ్జెక్టుల్లో సెట్ నిర్వహించాం.

ఆ సబ్జెక్టులివే..
ఆంత్రోపాలజీ, కెమికల్ సెన్సైస్ (ఎనలిటికల్, ఆర్గానిక్, ఇనార్గానిక్, మెడిసినల్, బయో ఇనార్గానిక్, ఫిజికల్, అప్లైడ్, న్యూక్లియర్, ఎన్విరాన్‌మెంటల్, మెరైన్, ఫార్మాస్యూటికల్, బయో ఇనార్గానిక్, సంబంధిత కెమిస్ట్రీ స్పెషలైజేషన్లు), కామర్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్, ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, ఇంగ్లిష్, ఎర్త్ సెన్సైస్ (జియాలజీ, అప్లైడ్ జియాలజీ, ఎంఎస్ జియాలజీ, జియోఫిజిక్స్, మెటియోరాలజీ, మెరైన్ జియాలజీ, పెట్రోలియం జియాలజీ, జియో ఇన్ఫర్మేటిక్స్, అప్లైడ్ జియో కెమిస్ట్రీ, ఓషనోగ్రఫీ, జియోగ్రఫీ తదితర), లైఫ్ సెన్సైస్ (బోటనీ, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, జెనెటిక్స్, మైక్రో బయాలజీ, జువాలజీ, ఫిషరీ సైన్స్, యానిమల్ బయాలజీ, మెరైన్ బయాలజీ, అప్లైడ్ జెనెటిక్స్ తదితర), లింగ్విస్టిక్స్, మేనేజ్‌మెంట్, హిందీ, హిస్టరీ, లా, మ్యాథమెటికల్ సెన్సైస్ (మ్యాథమెటిక్స్, అప్లైడ్ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, అప్లైడ్ స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్ విత్ కంప్యూటర్ సైన్స్ మొదలైనవి), ఫిజికల్ సెన్సైస్ (అటామిక్ అండ్ మాలిక్యులర్ ఫిజిక్స్, క్లాసికల్ డైనమిక్స్, కండెన్స్‌డ్ మేటర్ ఫిజిక్స్, ఎలక్ట్రోమ్యాగ్నటిక్స్, ఎక్స్‌పెరిమెంటల్ డిజైన్, ఎలక్ట్రానిక్స్, న్యూక్లియర్- స్పేస్ అండ్ పార్టికల్ ఫిజిక్స్, క్వాంటం ఫిజిక్స్, థర్మోడైనమిక్స్, ఆస్ట్రానమీ, ఆస్ట్రోఫిజిక్స్ మొదలైనవి), ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిలాసఫీ, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, తెలుగు, ఉర్దూ. ఈ ఏడాది మొత్తం 27 సబ్జెక్టుల్లో సెట్ నిర్వహించనున్నాం.

అర్హత:
55 శాతం (ఎస్సీ/ఎస్టీ/శారీరక వికలాంగులకు 50 శాతం) మార్కులతో సంబంధిత సబ్జెక్టులతో పీజీ ఉత్తీర్ణత. పీజీ ఫైనలియర్ పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్నవాళ్లు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి లేదు. అదేవిధంగా ఎన్నిసార్లయినా సెట్ రాయొచ్చు.

పీహెచ్‌డీ చేసినవారికి మినహాయింపు:
సంబంధిత అంశంలో పీహెచ్‌డీ చేసినవారికి ఏపీసెట్ నుంచి మినహాయింపు లభిస్తుంది. ఇప్పటికే పీహెచ్‌డీ పూర్తిచేసినవారు సెట్ రాయాల్సిన అవసరం లేదు. వీరు యథావిథిగా వివిధ యూనివర్సిటీలు/కళాశాలలు/ ఇన్‌స్టిట్యూషన్స్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులకు నిర్వహించే నియామక పరీక్షలను రాసుకోవచ్చు.

ఏడాదికి ఒకసారి మాత్రమే:
యూజీసీ నెట్, సీఎస్‌ఐఆర్ నెట్ మాదిరి ఏడాదికి రెండు సార్లు కాకుండా ఏపీసెట్‌ను కేవలం ఒక్కసారి మాత్రమే నిర్వహిస్తాం.కానీ సిలబస్ మాత్రం వాటి మాదిరిగానే ఉం టుంది. ఈసారి 27 సబ్జెక్టుల్లో కేవలం 7 సబ్జెక్టులకు మాత్రమే తెలుగు మీడియంలో ప్రశ్నపత్రాలు ఉంటాయి. మిగతా సబ్జెక్టులన్నీ ఇంగ్లిష్ మాధ్యమంలో ఉంటాయి. పీహెచ్‌డీ పూర్తి చేసిన అభ్యర్థులకు ఏపీసెట్ అదనపు అర్హతగా ఉంటుంది. ఒక అధ్యాపక ఉద్యోగానికి పీహెచ్‌డీ, ఏపీసెట్ లేదా నెట్ అభ్యర్థి పోటీపడినప్పుడు సెట్, నెట్ అర్హత గల అభ్యర్థులకే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కాబట్టి పీహెచ్‌డీ పూర్తి చేసిన అభ్యర్థులు కూడా ఏపీసెట్ రాస్తే అదనపు ప్రయోజనం ఉంటుంది.

నెగెటివ్ మార్కులు ఉండవు:
ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహించే పరీక్షలో మొత్తం మూడు పేపర్లుంటాయి. ప్రశ్నలన్నీ మల్టిపుల్ ఛాయిస్ విధానంలో ఉంటాయి. ఒకే రోజు రెండు వేర్వేరు సెషన్లలో పరీక్ష నిర్వహిస్తారు. వివరాలు..

పేపర్-1 (టీచింగ్ అండ్ ఆప్టిట్యూడ్):
ఏ సబ్జెక్టును ఎంచుకుని పరీక్ష రాసేవారికైనా కామన్‌గా ఉండేది పేపర్-1. ఇందులో అభ్యర్థి బోధన/పరిశోధన అభిరుచిని అంచనా వేసేలా ప్రశ్నలు ఉంటాయి. ఇందులో భాగంగా అభ్యర్థి గ్రహణశక్తి, రీజనింగ్ ఎబిలిటీలపై సాధారణ పరిజ్ఞానాన్ని పరీక్షించేలా ప్రశ్నలడుగుతారు. ఇందులో భాగంగా మొత్తం 60 ప్రశ్నలుంటాయి. ఏవైనా మొత్తం 50 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. ఒక్కో ప్రశ్నకు రెండు మార్కుల చొప్పున మొత్తం 100 మార్కులుంటాయి. 75 నిమిషాల్లో సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది. 50 కంటే ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలిచ్చినా మొదటి 50 ప్రశ్నలనే మూల్యాంకనం చేస్తారు.

పేపర్-2 (సబ్జెక్ట్ పేపర్):
ఇందులో భాగంగా అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్టుపై మొత్తం 50 ప్రశ్నలుంటాయి. అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. ఒక్కో ప్రశ్నకు రెండు మార్కుల చొప్పున మొత్తం 100 మార్కులుంటాయి. పరీక్ష కాలవ్యవధి 75 నిమిషాలు.

పేపర్-3 (సబ్జెక్ట్ పేపర్):
ఇందులో అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్టుపై పట్టును తెలుసుకునేలా లోతైన ప్రశ్నలు ఎదురవుతాయి. సంబంధిత సబ్జెక్టుకు సంబంధించి అన్ని స్పెషలైజేషన్ల నుంచి ప్రశ్నలడుగుతారు. ఉదాహరణకు కెమికల్ సెన్సైస్‌తో పరీక్ష రాయాలనుకునే విద్యార్థులు.. ఎనలిటికల్ కెమిస్ట్రీ, ఇనార్గానిక్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ, మెరైన్ కెమిస్ట్రీ, మెడిసినల్ కెమిస్ట్రీ, అప్లైడ్ కెమిస్ట్రీ, న్యూక్లియర్ కెమిస్ట్రీ, బయో ఇనార్గానిక్ కెమిస్ట్రీ ఇలా అన్ని స్పెషలైజేషన్లను ప్రత్యేక దష్టితో చదవాలి. ఎర్త్ సెన్సైస్‌ను ఎంచుకుని పరీక్ష రాసే విద్యార్థులు జియాలజీ, అప్లైడ్ జియాలజీ, ఎంఎస్ జియాలజీ, జియోఫిజిక్స్, మెటియోరాలజీ, మెరైన్ జియాలజీ, పెట్రోలియం జియాలజీ, జియో ఇన్ఫర్మేటిక్స్, అప్లైడ్ జియోకెమిస్ట్రీ అండ్ ఓషనోగ్రఫీలకు సంబంధించి అన్ని అంశాలను బాగా చదవాలి. లైఫ్ సెన్సైస్‌కు సంబంధించి బోటనీ, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, జెనెటిక్స్, మైక్రో బయాలజీ, జువాలజీ, ఫిషరీ సైన్స్, యానిమల్ బయాలజీ అండ్ మెరైన్ బయాలజీలపై కూడా దృష్టి సారించాలి. మ్యాథమెటికల్ సెన్సైస్ రాసేవారు మ్యాథమెటిక్స్, అప్లైడ్ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ అండ్ అప్లైడ్ స్టాటిస్టిక్స్ అంశాలను కూడా చదవాలి. ఫిజికల్ సెన్సైస్‌కు సిద్ధమయ్యేవారికి అటామిక్.. మాలిక్యులర్ ఫిజిక్స్, క్లాసికల్ డైనమిక్స్, కండెన్స్‌డ్ మేటర్ ఫిజిక్స్, ఎలక్ట్రో మ్యాగ్నటిక్స్, ఎక్స్‌పెరిమెంటల్ డిజైన్, ఎలక్ట్రానిక్స్, న్యూక్లియర్ ఫిజిక్స్, స్పేస్ ఫిజిక్స్, పార్టికల్ ఫిజిక్స్, క్వాంటం ఫిజిక్స్, థర్మోడైనమిక్స్‌ల అధ్యయనం తప్పనిసరి. ఇక ప్రశ్నల విషయానికొస్తే మూడో పేపర్‌లో మొత్తం 75 ప్రశ్నలుంటాయి. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ఒక్కో ప్రశ్నకు రెండు మార్కుల చొప్పున మొత్తం 150 మార్కులుంటాయి. పరీక్ష కాల వ్యవధి రెండున్నర గంటలు. మొదటి రెండు పేపర్లు రాసినవారిని మాత్రమే మూడో పేపర్ రాయడానికి అనుమతినిస్తారు. ప్రతి సబ్జెక్టు ప్రతి కేటగిరీ నుంచి 15 శాతం మంది అభ్యర్థులను మాత్రమే ఎంపిక చేస్తారు. అందులో నుంచి 6 శాతం మందిని మాత్రమే అర్హులుగా ప్రకటిస్తారు.

కేటగిరీల వారీగా అర్హత మార్కుల వివరాలు..
కేటగిరీ పేపర్-1 పేపర్-2 పేపర్-3
జనరల్ 40(40%) 40(40%) 75(50%)
బీసీ 35(35%) 35(35%) 67.5(45%)
ఎస్సీ/ఎస్టీ/
పీహెచ్/
వీహెచ్ 35(35%) 35(35%) 60(40%)

గతేడాది లక్షకుపైగా:
గతేడాది ఏపీసెట్‌కు లక్షకు పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 96,955 వేల మంది పరీక్షకు హాజరయ్యారు. అందులో 11,073 మంది ఏపీసెట్‌లో అర్హత సాధించారు. లైఫ్‌సెన్సైస్‌కు అధిక సంఖ్యలో 15,686 దరఖాస్తులు అందాయి. తర్వాత కెమికల్ సెన్సైస్‌కు 13,509, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్‌కు 6,631, ఎకనామిక్స్‌కు 6,489, కామర్స్‌కు 6,241, మేనేజ్‌మెంట్‌కు 3,208, చరిత్రకు 2,394, గణితశాస్త్రానికి 6,755, ఫిజికల్‌సైన్స్‌కు 6,183, తెలుగుకు 9,379 మంది దరఖాస్తు చేసుకున్నారు. తక్కువ దరఖాస్తులు వచ్చిన సబ్జెక్టులు...లింగ్విస్టిక్స్ 38, ఫిలాసఫీ 88, ఆంత్రోపాలజీకి 75 దరఖాస్తులు మాత్రమే అందాయి.

ఇక సప్లిమెంటరీ ఫలితాలు ఉండవు:
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో తక్కువ శాతం మంది అర్హత సాధించడం వల్ల అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు సప్లిమెంటరీ ఫలితాలకు యూజీసీ అనుమతించింది. యూజీసీ ఉత్తర్వుల మేరకు ఏపీసెట్-2012 సప్లిమెంటరీ ఫలితాలు విడుదల చేశాం. భవిష్యత్తులో ఇలా ఉండదు. గతేడాది తొలిసారి నిర్వహించిన ఏపీసెట్ పట్ల అభ్యర్థులకు సరైన అవగాహన లేనందున సెట్‌లో ఉత్తీర్ణతశాతం తక్కువగా ఉంది. గత ఏపీసెట్ ప్రశ్నపత్రాలు, కీ, ఇతర వివరాలను నెట్‌లో అభ్యర్థులకు అందుబాటులో ఉంచాం.

సెట్ వల్ల బహుళ ప్రయోజనాలు:
ఏపీసెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు అనేక అవకాశాలు ఉన్నాయి. వీరు డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్, విశ్వవిద్యాలయాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల నియామక పరీక్షలకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఉద్యోగాలు చేసే లెక్చరర్లకు పేస్కేల్ పెరగడమే కాకుండా కళాశాల ప్రిన్సిపాల్స్‌గా పదోన్నతి లభిస్తుంది. భవిష్యత్తులో జూనియర్ కళాశాలల లెక్చరర్ ఉద్యోగాలకు సైతం సెట్ అర్హతను నిర్ణయిస్తే వాటికి దరఖాస్తు చేసుకోవచ్చు.

మంచి పుస్తకాలను ఎంచుకొని చదవాలి
ఏపీసెట్‌కు సంబంధిత సబ్జెక్టులో ప్రామాణిక పుస్తకాలను ఎంపిక చేసుకుని శ్రద్ధగా చదవాలి. రోజుకు 8 గంటల చొప్పున 6 నెలలు కష్టపడి చదివితే ఏపీసెట్‌లో అర్హత సాధించే అవకాశం ఉంటుంది. యూజీసీ, సీఎస్‌ఐఆర్ నెట్ సిలబస్‌లను, పాత ప్రశ్నపత్రాలను పరిశీలించాలి. కరెంట్ అఫైర్స్‌తోపాటు జనరల్ నాలెడ్జ్, ఆప్టిట్యూడ్, సబ్జెక్టు అంశాలపై పూర్తి అవగాహన అవసరం. ఏపీసెట్ లక్ష్యంగా పెట్టుకొని పట్టుదలతో చదివితే తప్పక విజయం సాధిస్తారు.

-సవలం ఉపేందర్,

న్యూస్‌లైన్, ఓయూ, హైదరాబాద్.
Published date : 13 Jun 2013 04:26PM

Photo Stories