Job Mela: మెగా జాబ్ మేళా
ఈ జాబ్ మేళ పోస్టరును శాసన సభ్యులు శెట్టి పల్లే రఘు రామి రెడ్డి గారి చేతుల మీదుగా అక్టోబర్ 12న ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ జాబ్ మేళాకు టాటా ఎలక్ట్రానిక్స్ , టిసిల్, శ్రీ రామ్ లైఫ్ ఇన్సూరెన్స్, అపోలో ఫార్మసీ ,అమర్ రాజా బ్యాటరీ, గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్, lic, షిర్డి సాయి ఎలక్ట్రికల్, బ్లూ స్టార్, Dixon, వంటి ప్రముఖ కంపెనీలు వస్తున్నాయి.
చదవండి: Good News: విరికి ప్రభుత్వ ఉద్యోగాలో రిజర్వేషన్ పెంపు
ఈ జాబ్ మేళాలో 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ , పీజీ ,డిప్లమా, ఇంజనీరింగ్ అభ్యర్థులు పాల్గొనవచ్చు. ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్లు, బయోడేటా, ఆధార్, పాస్ పోర్ట్ సైజు ఫోటోతో హాజరుకావాలి. ఇంటర్వ్యూ ప్రాతిపదికన ఎంపిక చేయబడును.
చదవండి: Railway Jobs: సదరన్ రైల్వేలో 3134 పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
మైదుకూరు, ప్రొద్దటూరు, బద్వేల్, పోరుమమిళ్ళ, పరిసర ప్రాంతాల నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలియజేశారు మరిన్ని వివరాలకు సంప్రదిoచాల్సిన నంబర్లు: 9701801902, 9398348760,7013504977.