Vivek Venkatswamy: పవర్‌ప్లాంట్ విస్తరణతో ఉద్యోగావకాశాలు
Sakshi Education
జైపూర్: ప్లాంట్ విస్తరణ, కొత్త బొగ్గు బావుల ఏర్పాటుతో మెండుగా ఉద్యోగావకాశాలు లభి స్తాయని చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి తెలిపారు.
స్థానికులకే 80శాతం ఉద్యోగాలు ఇచ్చేలా ప్రత్యేక జీవో తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. జైపూర్ పవర్‌ప్లాంట్ వద్ద డిసెంబర్ 26న పలువురు నాయకులు టీబీజీకేఎస్ నుంచి ఐఎన్టీయూసీలో చేరగా వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. ప్లాంట్‌కు చెందిన పలువురు ఉద్యోగులు, ఐకే–1 గనికి చెందిన కార్మికులు ఐఎన్టీయూసీలో చేరారు.
చదవండి: Singareni: 21లోగా ఉద్యోగుల ఖాతాల్లో లాభాల వాటా?
అనంత రం వివేక్ మాట్లాడుతూ.. సింగరేణి సంస్థను కాపాడుకోవడానికి గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఐఎన్టీయూసీని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రిక్కుల శ్రీనివాస్‌రెడ్డి, మండలాధ్యక్షుడు ఫ యాజ్, నాయకులు సత్యనారాయణరెడ్డి, తిరుపతిరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, సంపత్‌రెడ్డి, రాకేశ్‌గౌడ్, వెంకన్న, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.
Published date : 27 Dec 2023 03:29PM