Skip to main content

UGC రెగ్యులేషన్స్ 2025: యూజీ, పీజీ డిగ్రీ కోర్సుల్లో కీలక మార్పులు, కొత్త నిబంధనలు!

భారతదేశంలోని ఉన్నత విద్యా వ్యవస్థలో పెరుగుతున్న నాణ్యత, స్థిరత్వం, మరియు విద్యార్థుల భవిష్యత్‌కు అనుగుణంగా ఉండే విధంగా UGC (యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్) 2025 నూతన నిబంధనలను ప్రకటించింది. ఈ మార్గదర్శకాలు UG & PG కోర్సులలో కీలకమైన మార్పులకు దారితీయనున్నాయి.
UGC guidelines for UG and PG courses 2025   ugc regulations 2025 ug pg degree changes guidelines   UGC new regulations 2025 announcement

1. నాలుగేళ్ల అండర్‌గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రాం (FYUP)
UG డిగ్రీలు ఇకపై 4 సంవత్సరాల పాటు కొనసాగుతాయి

మధ్యలో విడిచే విద్యార్థులకు మల్టిపుల్ ఎగ్జిట్ ఆప్షన్లు:

1వ సంవత్సరం తర్వాత: సర్టిఫికెట్

2వ సంవత్సరం తర్వాత: డిప్లొమా

3వ సంవత్సరం పూర్తి చేసినవారికి: UG డిగ్రీ

4వ సంవత్సరం పూర్తి చేసినవారికి: UG హానర్స్ / హానర్స్ విత్ రిసర్చ్

రిసర్చ్‌తో హానర్స్ పూర్తి చేసిన విద్యార్థులు నేరుగా Ph.D. లో ప్రవేశం పొందవచ్చు (పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ అవసరం లేదు)

2. పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ (PG) ప్రోగ్రాములు
PG కు రెండు రకాల వ్యవస్థలు:

1 సంవత్సరం PG: 4 సంవత్సరాల UG హానర్స్ లేదా హానర్స్ విత్ రిసర్చ్ ఉన్నవారికి

2 సంవత్సరాల PG: 3 సంవత్సరాల UG పూర్తి చేసినవారికి

డిసెర్టేషన్/థీసిస్ తప్పనిసరి (ఇద్దరిపైనా వర్తిస్తుంది)

3. ఫ్లెక్సిబిలిటీ & క్రెడిట్ మాబిలిటీ (ABC)

  • అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ (ABC) ద్వారా విద్యార్థులు తమ క్రెడిట్లను జమ చేయవచ్చు, బదిలీ చేసుకోవచ్చు
  • విషయ మార్పులు లేదా ఇన్స్టిట్యూషన్ మార్పు సులభం

4. మల్టీడిసిప్లినరీ & స్కిల్ ఆధారిత విద్య

  • విద్యలో హోలిస్టిక్, ప్రాక్టికల్ మరియు స్కిల్ బేస్డ్ అభ్యాసం పై దృష్టి
  • ఇంటర్న్‌షిప్‌లు, ఫీల్డ్‌వర్క్‌, రిసర్చ్ ప్రాజెక్టులు కలిపి
  • రొజుగారి అవకాశాలు, డిజిటల్ స్కిల్స్ పై ప్రత్యేక దృష్టి

చదవండి: ప్లాస్టిక్‌ ఇంజనీరింగ్‌ కోర్సులు.. అడ్మిషన్‌ ప్రాసెస్‌, అర్హతలు, కెరీర్‌ అవకాశాలు!

Join our WhatsApp Channel: Click Here
 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

5. అంచనా & గ్రేడింగ్ విధానం

  • తరచూ మరియు సమగ్ర మదింపు విధానం
  • చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ (CBCS) ఆధారంగా గ్రేడింగ్

6. ఆన్‌లైన్‌, బ్లెండెడ్‌, డిస్టెన్స్ లెర్నింగ్ మోడ్‌లు

  • కోర్సులు ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌, బ్లెండెడ్‌, డిస్టెన్స్ మోడ్‌లలో అందుబాటులో ఉంటాయి
  • UGC అనుమతి మరియు గుర్తింపు తప్పనిసరి

7. విలువల ఆధారిత విద్య
భారత జ్ఞాన సంప్రదాయాలు, నైతికత, పర్యావరణ విద్య, సమాజ సేవ అంశాలు తప్పనిసరి

8. మల్టిపుల్ ఎంట్రీ - ఎగ్జిట్ & క్రెడిట్ ట్రాన్స్‌ఫర్

  • విద్యార్థులు విద్య విరామం తర్వాత తిరిగి చేరవచ్చు
  • ఇప్పటికే పొందిన క్రెడిట్లతో కొనసాగించవచ్చు

9. జాతీయ & అంతర్జాతీయ విద్యా మార్పిడి అవకాశాలు
స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాములు, డ్యూయల్ డిగ్రీలు, విదేశీ విశ్వవిద్యాలయాలతో భాగస్వామ్యం ప్రోత్సహించబడతాయి

ఈ కొత్త నిబంధనలు 2025 విద్యా సంవత్సరం నుండి అమల్లోకి రానున్నాయి. 

Published date : 07 May 2025 04:02PM
PDF

Photo Stories