Free Coaching: స్వయం ఉపాధి కోర్సుల్లో యువతకు శిక్షణ.. దరఖాస్తుకి ఇవి తప్పనిసరి!

పదో తరగతి పాస్ లేదా ఫెయిల్ అయిన యువతకు మూడు నెలల పాటు ఫ్యాషన్ డిజైనింగ్, గార్మెంట్ తయారీ, బ్యూటీషియన్, ఎంఎస్ ఆఫీస్, రిఫ్రిజిరేషన్, ఎయిర్ కండీషన్, మొబైల్ సర్వీసింగ్, రిపేరుపై శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.
చదవండి: Training In Beautician And Fashion Designing: ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీషియన్ కోర్సుల్లో శిక్షణ
7వ తరగతి పాసైన వారికి జర్దోసి, మగ్గం, ఎలక్ట్రిషియన్ కోర్సుల్లో శిక్షణ ఉంటుందని తెలిపారు. శిక్షణ అనంతరం పరీక్ష నిర్వహించి ఉత్తీర్ణులైన వారికి హైదరాబాద్ సెట్విన్ వారిచే సర్టిఫికెట్ ఇస్తామని వివరించారు. ఆసక్తిగల వారు పాత డీఈఓ కార్యాలయంలోని వృత్తి నైపుణ్య శిక్షణా కేంద్రంలో దరఖాస్తులు అందజేయాలని కోరారు.
![]() ![]() |
![]() ![]() |
దరఖాస్తు వెంట విద్యార్హత, ఆధార్ కార్డు, పాస్‌పోర్టు సైజ్ ఫొటోతో జత చేయాలని కోరారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, వివరాలకు సెంటర్ ఇన్‌చార్జి ఎస్.విజయ్‌కుమార్ (94415 65895)ను సంప్రదించాలని సూచించారు.