Skip to main content

Schools Reopen: తొలిరోజు ప్రభుత్వ స్కూళ్లలో 27%, ప్రైవేటులో 18% హాజరు

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలు తిరిగి ప్రారంభమైనా.. తొలిరోజున విద్యార్థుల హాజరు నామమాత్రంగా నమోదైంది.
Schools Reopen: తొలిరోజు ప్రభుత్వ స్కూళ్లలో 27%, ప్రైవేటులో 18% హాజరు
తొలిరోజు ప్రభుత్వ స్కూళ్లలో 27%, ప్రైవేటులో 18% హాజరు

సెప్టెంబర్‌ 1న చాలావరకు ప్రభుత్వ, ప్రైవేటు బడులన్నీ బోసిపోయి కనిపించాయి. విద్యార్థులను బడులకు రప్పించేందుకు విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు ప్రయతి్నంచారు. జిల్లా, రాష్ట్రస్థాయిలో అధికారులు కూడా రంగంలోకి దిగారు. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్వయంగా కొన్ని ప్రాంతాల్లో పర్యటించారు. కానీ విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు కూడా పెద్దగా ఆసక్తి చూపని పరిస్థితి కనిపించింది. ఇంకొన్ని రోజులు వేచిచూద్దామని తల్లిదండ్రులు అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. ప్రైవేటు విద్యాసంస్థల్లో ప్రత్యక్ష బోధనకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. ప్రభుత్వం ఆన్లైన్ బోధనకు వెసులుబాటు ఇవ్వడంతో.. పాఠశాలలతో పాటు విద్యార్థులు కూడా ఆన్లైన్నే ఆప్షన్గా ఎంచుకున్నారు. ఫలితంగా ప్రైవేటు సంస్థల్లో విద్యార్థుల హాజరు తక్కువగా నమోదైంది. బుధవారమే మొదటి రోజు కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లలో విద్యార్థుల హాజరు తక్కువగా ఉందని, కొద్దిరోజుల్లోనే పుంజుకుంటుందని అధికారులు చెప్తున్నారు. 

సగటున 22 శాతం మించలేదు 
గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లు మినహా అన్ని విద్యాసంస్థలను పునఃప్రారంభించారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం తొలిరోజున ప్రభుత్వ స్కూళ్లలో 27.45 శాతం, ప్రైవేటు బడుల్లో 18.35 శాతం విద్యార్థుల హాజరునమోదైంది. మొత్తంగా సగటు హాజరుశాతం 22శాతానికి మించలేదని అధికార వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో 405 ఇంటర్‌ కాలేజీల్లో ఫస్టియర్‌ విద్యార్థులు 97,520 మందికిగాను 16,907 మంది.. సెకండియర్‌లో 84,038 మందికిగాను 12,687 మంది హాజరయ్యారు. సగటున 15 శాతమే హాజరు నమోదైంది.

  • పట్టణ ప్రాంతాలతో పోలిస్తే.. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులు ఎక్కువ మంది బడికి వచ్చారు. గ్రామాల్లో తల్లిదండ్రుల నుంచి పెద్దగా అభ్యంతరాలు కని్పంచలేదని ఉపాధ్యాయులు చెప్తున్నారు. అయితే సీజనల్‌ జ్వరాలు, ఇతర అనారోగ్యం ఉన్నవారిని బడులకు రాకుండా చూశారు. వ్యవసాయ పనులకు వెళ్లే విద్యార్థుల్లో చాలా వరకు పాఠశాలకు రావడానికి ఆసక్తి చూపలేదు.
  • పట్టణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాల లకు విద్యార్థుల హాజరు తక్కువగా ఉంది. తల్లిదండ్రులు వేచి చూసే ధోరణి అవలం బిస్తున్నారని, క్రమంగా హాజరు పుంజుకుంటుందని అధికారులు చెప్తున్నారు.
  • గ్రామీణ ప్రాంతాల్లో ప్రైవేటు స్కూళ్లలో హాజరు కాస్త మెరుగ్గా ఉంది. కానీ సమీపంలోని పట్టణాలు, వేరే ఊర్లలో చదువుతున్న విద్యార్థులు మాత్రం వెళ్లలేదు. పాఠశాలల వాహనాలు గ్రామాలకు వచ్చినా తల్లిదండ్రులు పిల్లలను పంపలేదు.
  • పట్టణ, నగర ప్రాంతాల్లోని ప్రైవేటు స్కూళ్లలో హాజరుశాతం తక్కువగా కనిపించింది. ఏడాదిన్నరగా బడులు లేకపోవడం, ఉపాధి అవకాశాలు సన్నగిల్లడంతో చాలామంది తల్లిదండ్రులు సొంతూర్లకు వెళ్లారు. వారు ఇప్పటికిప్పుడు పట్టణాలకు వచ్చే పరిస్థితి లేదు. దానికితోడు ఆన్లైన్ బోధన ఉండటంతో.. దానికే ప్రాధాన్యత ఇస్తున్నారు.
  • కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో చాలా వరకు ఆన్లైన్ బోధనకే ప్రాధాన్యం ఇస్తున్నాయి. చిన్నగదుల్లో ప్రత్యక్ష బోధన వల్ల సమస్యలు రావొచ్చనే ఆలోచనతో ఉన్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా కొంతకాలం పరిస్థితిని గమనించాకే స్కూళ్లకు పంపాలని భావిస్తున్నారు.



పదవ తరగతి స్టడీ మెటీరియల్

Published date : 02 Sep 2021 05:58PM

Photo Stories